Header Ads

RCB vs DC: తొందరపడిన కోహ్లీ.. తప్పు గ్రహించి అంపైర్‌కి క్షమాపణలు

 

Virat Kohli (Photo Credit: Twitter)
ఐపీఎల్ 2020 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ దాదాపు రూల్‌ని బ్రేక్ చేయబోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో దుబాయ్ వేదికగా సోమవారం రాత్రి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ బంతిని అందుకున్న విరాట్ కోహ్లీ.. దానిపై ఉమ్ము రుద్దబోయాడు. బంతిని అడ్డుకున్న వెంటనే కోహ్లీ తన వేళ్లకి ఉమ్ము రాసుకుని బంతిపై రాయబోయాడు. కానీ.. ఆఖరి క్షణంలో అతనికి ఐసీసీ నిబంధనలు గుర్తొచ్చి ఆగిపోయాడు. బంతిపై కోహ్లీ ఉమ్ము రాయబోతుండటాన్ని ఫీల్డ్ అంపైర్ అలానే చూస్తూ ఉండటంతో.. తప్పుని గ్రహించిన కోహ్లీ మైదానంలో అతనికి క్షమాపణలు చెప్తూ కనిపించాడు.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. బంతిపై ఉమ్ము రుద్దడాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇటీవల నిషేధించింది. అయినప్పటికీ.. కొంత మంది క్రికెటర్లు అలవాటులో పొరపాటులా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు బంతిపై ఉమ్ముని రాస్తున్నారు. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ ఫీల్డర్ రాబిన్ ఉతప్ప.. క్యాచ్‌ని వదిలేసిన తత్తరపాటులో బంతిపై ఉమ్ము రాస్తూ కనిపించాడు. అయితే.. ఫీల్డ్ అంపైర్లు అతని తప్పిదాన్ని గుర్తించలేదు. కానీ.. నెటిజన్లు మాత్రం రాబిన్ ఉతప్పని ఉతికారేశారు.


    మైదానంలో బంతిపై ఎవరైనా ఉమ్ము రాస్తే..? వెంటనే ఫీల్డ్ అంపైర్ ఆ బంతిని తీసుకుని టిస్యూ‌తో శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మ్యాచ్‌ని కొనసాగించాలి. సోమవారం రాత్రి మ్యాచ్‌లో బంతిపై కోహ్లీ ఉమ్ము రాయబోతూ ఆఖరి క్షణంలో ఆగిపోయినందున.. ఫీల్డ్ అంపైర్ బంతిని శుభ్రం చేయలేదు. దాంతో.. మ్యాచ్‌ అలానే కొనసాగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 59 పరుగుల తేడాతో బెంగళూరుని ఓడించింది.

    No comments

    Powered by Blogger.