ప్రియ బర్త్‌డే వేడుకల్లో మహేశ్ ఫ్యామిలీ సందడి
సూపర్ స్టార్ కృష్ణ చిన్న కూతురు, హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని పుట్టిన రోజు వేడుకను ఘట్టమనేని ఫ్యామిలీ గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది. నాన్న కృష్ణ, బావలు జయదేవ్, సంజయ్ స్వరూప్, సుధీర్లతో కలిసి సందడిగా గడిపారు. ఈ వేడుకల్లో సూపర్‌స్టార్ కృష్ణ, ఆయన సోదరుడు, నిర్మాత ఆదిశేషగిరిరావు, మహేశ్, నమ్రత, సంజయ్ స్వరూప్, జయదేవ్, సుధీర్‌బాబు పాల్గొన్నారు. సోదరీమణులు, బావలు, నాన్న కృష్ణతో కలిసి మహేశ్ బాబు-నమ్రత జంట భోజనం చేశారు. ఈ ఫోటోలను సుధీర్ బాబు ట్వీటర్లో పోస్ట్ చేస్తూ ‘ ఈ రోజు నా లైఫ్ పుట్టింది. హ్యాపీ బర్త్‌డే ప్రియా’అని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Post a Comment