కుక్కను పోలిన గబ్బిలం!..ఎప్పుడైనా చూశారా..?
రాష్ట్రంలో పలు చిత్ర విచిత్ర సంఘటనలు బయటపడ్డాయి. అటు ఆదిలాబాద్ జిల్లాలో గోదావరిలో ఏర్పడ్డ చీలిక దృశ్యం కనువిందు చేయగా..ఖమ్మం జిల్లాలో మూషిక జింక కనిపించి హల్‌చల్ చేసింది. ఈ క్రమంంలోనే యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ మరో వింత జీవి ప్రత్యక్షం అయ్యింది. దానిని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.
యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూర్‌లో వింత గబ్బిలం ప్రత్యక్షమైంది. స్థానిక శ్రీరామలింగేశ్వర గుడివద్ద మంగళవారం వింత ఆకారంలో ఉన్న గబ్బిలం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. అది చూసేందుకు కుక్కలాంటి తల, పొడవాటి రెక్కలు కలిగి విచిత్రంగా కనిపించింది. దీన్ని చూసేందుకు జనం క్యూకడుతున్నారు
Post a Comment