'ఆహా'కి పోటీగా మరో తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ రానుందా..? | Will there be another Telugu digital platform to compete with Aha
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ సందడి మొదలైంది. అనేక కొత్త ఓటీటీలు - ఏటీటీలు అందుబాటులోకి వచ్చాయి. ఇండిపెండెంట్ సినిమాలు వెబ్ సిరీస్ లతో పాటు కొత్త సినిమాలను కూడా విడుదల చేస్తూ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఇక మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' కూడా ప్రత్యేకతను చాటుకోడానికి ప్రయత్నిస్తోంది. మలయాళ డబ్బింగ్ సినిమాలను ఎక్కువగా స్ట్రీమింగ్ కి పెడుతూ టాలీవుడ్ ని మరో మాలీవుడ్ అనుకునేలా చేస్తోంది. తెలుగు నెట్ ఫ్లిక్స్ మాదిరిగా ముందుకు సాగుతున్న 'ఆహా'.. కంటెంట్ ఉన్న కథలకి ఇంపార్టెన్స్ ఇస్తూ సబ్ స్కైబర్స్ ని పెంచుకోవాలని ట్రై చేస్తోంది. అయితే ఇప్పుడు 'ఆహా' పోటీగా మరో తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ రాబోతోందని టాక్ నడుస్తోంది.
రాబోయే రోజుల్లో డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ దే రాజ్యమని భావించిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఓటీటీ వరల్డ్ లో అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రొడ్యూసర్ దిల్ రాజు సారధ్యంలో మ్యాంగో రామ్ ఓ తెలుగు ఓటీటీ యాప్ డెవలప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందులో రిలయన్స్ వారితో కలిసి మహేశ్ బాబు బ్యాక్ ఎండ్ లో పెట్టుబడులు పెడుతున్నారట. అంతేకాకుండా దిల్ రాజు వర్కింగ్ పార్టనర్ గా ఉండబోతున్న ఈ కొత్త డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ కి మహేష్ బాబు - రామ్ చరణ్ ల్ బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరించబోతున్నారట. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.
Post a Comment