ప్రియుడితో నడిరోడ్డు మీద శృతి.. ఎవరీ కొత్త బాయ్ ఫ్రెండ్..? | Shruthi Hassan Spotted With New Boy Friend In Mumbai Streets
ఇప్పుడు హీరోయిన్ శృతిహాసన్ రెండు విధాలా స్వింగ్ లో ఉంది. మొదటిది సినీ కెరీర్. కొంత కాలంగా అపజయాలనే చవిచూస్తున్న ఈ అమ్మడు.. లేటెస్ట్ గా క్రాక్ తో సక్సెస్ టేస్ట్ చేసింది. ఈ విజయంతో మరిన్ని ఛాన్స్ లు ఒడిసి పట్టుకోవాలని ట్రై చేస్తోంది. సినిమా విషయం ఇలాఉంటే.. ఇక శృతి స్వింగ్ లో ఉన్న రెండో విషయం లవ్. ఇటీవల మళ్లీ లవ్ లో ఉన్నట్టు చెప్పిన బ్యూటీ.. తాజాగా కొత్త బాయ్ఫ్రెండ్తో ముంబై వీధుల్లో తిరుగుతూ మీడియాకు చిక్కింది.
గతంలో లండన్కు చెందిన మైఖేల్ కోర్సలేతో శృతి హాసన్ పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయింది. ఇక పెళ్లే తరువాయి అన్నట్టుగా డేట్ కంటిన్యూ చేశారు. జంటగా చెన్నైలో జరిగిన ఓ పెళ్లికి కూడా హాజరయ్యారు. కానీ.. ఆ తర్వాత అభిప్రాయ బేధాలు రావడంతో 2019లో విడిపోయారు. కోర్సలేతో విడిపోయిన తర్వాత శృతి ఒంటరిగానే ఉంటూ వచ్చారు.
అయితే.. ఇటీవల ఇన్స్టా గ్రామ్లో అభిమానులతో లైవ్ చాట్ చేసింది శృతి. ఈ సందర్భంగా.. మళ్లీ ప్రేమలో పడ్డారా? అని ఓ ఫ్యాన్ అడిగితే.. ‘బాయ్ ఫ్రెండ్ ఉన్నారు. నేను ఎప్పుడూ ప్రేమలో ఉంటూనే ఉంటాను.’ అంటూ జవాబిచ్చింది శృతి. ఇక ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తూ ముంబైలో పలు రెస్టారెంట్లలో మీడియా కంటపడినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ వార్తలకు బలం చేకూరేలా జనవరి 27వ తేదీన బాయ్ఫ్రెండ్తో రోడ్డుమీద చెట్టాపట్టాలేసుకొని తిరగడంతో ఈ న్యూస్ వైరల్ అయ్యింది.
అయితే.. మీడియాకు చిక్కిన వీడియోలో జీన్స్ టీషర్ట్ వేసుకొన్న శృతి హాసన్ ముఖానికి మాస్క్ ధరించి ఉంది. ప్రియుడి చేతిని పట్టుకొని రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తూ కనిపించింది. అయితే.. ప్రియుడు కూడా మాస్క్ ధరించి ఉండటంతో అతడు ఎవరనేది మిస్టరీగానే మిగిలిపోయింది. మరి ఇంతకీ.. ఈ బ్యూటీ హృదయాన్ని శృతి చేసిన ఆ మొనగాడు ఎవరై ఉంటారో..?
Post a Comment