Header Ads

'రెడ్' టికెట్ ట్రోలింగ్ పై స్పందించిన రామ్..! | Ram responds to red ticket trolling

 Ram responds to red ticket trolling

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన తాజా చిత్రం ''రెడ్'' ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో రామ్ తో పాటు హీరోయిన్లు మాళవిక శర్మ - అమృత అయ్యర్ - నివేత పేతురాజ్.. దర్శకుడు కిషోర్ తిరుమల - నిర్మాత స్రవంతి రవి కిషోర్ హాజరయ్యారు. దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా చిత్ర బృందం త్రివిక్రమ్ చేతుల మీదుగా 'స్టే సేఫ్ - సేవ్ సినిమా' అని రాసి ఉన్న ఒక పెద్ద టికెట్ ని రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో 'రెడ్' సినిమాపై ట్రోల్స్ చేయడానికి అవకాశం కల్పించింది.

ఎందుకంటే ఆ టికెట్ పై 'రెడ్' స్టిక్కర్ వేసినప్పటికీ రిలీజ్ డేట్ మాత్రం 'జనవరి 14'కి బదులుగా 'జనవరి 9' అని రాసి ఉంది. అది 'క్రాక్' సినిమా రిలీజ్ డేట్ అనే సంగతి తెలిసిందే. దీంతో'క్రాక్' ఈవెంట్ లో రిలీజ్ చేసిన టికెట్ పై ఇప్పుడు 'రెడ్' పేరు మార్చినట్లు తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. చిత్ర యూనిట్ - ఈవెంట్ ఆర్గనైజర్స్ పై మీమ్స్ క్రియేట్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రోలింగ్ పై రామ్ పోతినేని ట్విట్టర్ వేదికగా స్పందించారు. ''అప్పుడప్పుడు తప్పులు జరుగుతాయి.. ఏం పర్వాలేదు'' అని ట్వీట్ చేశాడు రామ్.

No comments

Powered by Blogger.