Header Ads

మళ్లీ సంపూర్ణ లాక్ డౌన్.. ప్రకటించిన ప్రధాని | Prime Minister Announced Complete lock down again

 Prime Minister Announced Complete lock down again

కరోనా మహమ్మారి మరోసారి బ్రిటన్ దేశాన్ని కమ్మేస్తోంది. ఆ దేశంలో కొత్త కరోనా స్ట్రెయిన్ వెలుగుచూడడంతో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్రమంలోనే బ్రిటన్ ప్రధాని సంచలన నిర్ణయం తీసుకున్నారు.

గత మార్చి-ఏప్రిల్ లో  ఇంగ్లాండ్ దేశంలో పూర్తిగా లాక్ డౌన్ విధించారు. నాడు విపరీతంగా ప్రబలుతున్న  కరోనావైరస్ ను అరికట్టడానికి లాక్డౌన్ ను విధించారు. యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ఫిబ్రవరి మధ్యకాలం నుంచి ఇంగ్లాండ్ వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించాడు. సంక్రమణ రేటు  వ్యాప్తిని తగ్గించడంలో భాగంగా ఈ చర్య చేపట్టారు.

తాజాగా కరోనా స్ట్రేయిన్ కేసులు పెరుగుతుండడంతో బ్రిటన్ లో మరోసారి సంపూర్ణ లాక్డౌన్ విధించారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆసుపత్రుల్లో బాధితుల సంఖ్య పెరిగిపోతుందని దీంతో వైద్యులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని ఆ దేశ ప్రధానమంత్రి బోరిస్ సోమవారం తెలిపారు. దీంతో సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించక తప్పదన్నారు.

లాక్ డౌన్ వేళ ప్రతి ఒక్కరూ ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని కోరారు. ఈ లాక్ డైన్ నెలరోజుల పాటు అమలులో ఉంటుందన్నారు. కాగా సోమవారం బ్రిటన్ లో అక్స్ ఫర్డ్- ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది.

సోమవారం వరకు ఇంగ్లాండ్ లోని ఆసుపత్రుల్లో 26626 మంది కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇది వారం కిందటి కంటే 30 శాతం ఎక్కువ కావడం గమనార్హం.

No comments

Powered by Blogger.