ఓమై గాడ్.. సూర్య రెమ్యునరేషన్ తెలిస్తే షాకే! | O my God Shock if you know Surya Remuneration
తమిళ్ హీరో సూర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేస్తాడు. సినిమాలో నటించడం కాదు.. జీవిస్తాడు. తన క్యారెక్టర్ కు ప్రాణం పోస్తాడు. ఈ తరం నటులలో అద్భుతమైన నటనను పండిస్తాడు. ఇటీవల రిలీజైన సూర్య మూవీ ‘సూరరై పొట్రూ’(ఆకాశం నీ హద్దురా) ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. సింగిల్ లైన్ మీద నడిచిన సినిమా మొత్తాన్ని ప్రేక్షకులు స్కిప్ చేయకుండా కళ్లుపెద్దవి చేసుకొని మరీ ఓటీటీలో చూశారంటే.. ఆ ఘనతలో మొదటి ప్లేస్ కథదైతే.. రెండో స్థానం సూర్యదే. అంతలా తన నటినా ప్రావీణ్యంతో ఆడియన్స్ ను కట్టిపడేశాడు.
ఈ బ్లాక్ బస్టర్ హిట్ తో సూర్య రేంజ్ మరింత పెరిగింది. మనోడి స్టార్ డమ్ ఆకాశాన్నంటుతోంది. ఈ విషయాన్ని ఓ లేటెస్ట్ న్యూస్ బయటపెట్టింది. అందుతున్న లేటెస్ట్ సంచలన సమాచారం ప్రకారం.. తన రాబోయే చిత్రానికి సూర్య భారీ పారితోషికం తీసుకోబోతున్నాడట. తమిళనాట అద్భుతమైన దర్శకుడిగా ప్రశంసలు పొందిన వెట్రిమారన్తో కలిసి సినిమా చేయబోతున్నాడు సూర్య. ‘వాడి వాసల్’ పేరుతో తెరకెక్కబోతన్న ఈ చిత్రానికి గానూ పారితోషికంగా ఏకంగా రూ.35 కోట్లు అందుకోబోతున్నాడట సూర్య.
ఏ రకంగా చూసుకున్నా.. సౌత్ లో ఇది పెద్ద రెమ్యునరేషన్ అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ అమౌంట్ పీక్ స్టేజ్ లో ఉన్న సూర్య స్టార్ డమ్ ను తెలుపుతోందంటున్నారు పరిశీలకులు. కాగా.. ‘వాడి వాసల్’ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. హీరో సూర్య దర్శకుడు వెట్రిమారన్ ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు కమిట్ అయి ఉన్నారు.
ప్రస్తుతం లైన్లో ఉన్న సినిమాలను పూర్తి చేసిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం. ఇప్పుడు సూర్యకు.. దర్శకులు పండిరాజ్ హరితో వేర్వేరు ప్రాజెక్టులు ఉన్నాయి. అవన్నీ పూర్తయిన తర్వాత ‘వాడి వాసల్’ మొదలు కానుంది. కాగా.. వెట్రిమారన్ తనదైన టేకింగ్ తో డైరెక్టర్ గా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక సూర్య నిస్సందేహంగా ఓ అద్భుతమైన నటుడు. వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా ఎలాంటి రిజల్ట్ చూపుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Post a Comment