దొరస్వామి రాజుకు జక్కన్న నివాళులు..! | Jakkanna pays tribute to Doraswamy Raju
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత వి.దొరస్వామి సోమవారం ఉదయం వయోభారం కారణంగా తుది శ్వాస విడిచిన సంగతి విదితమే. దొరస్వామి మరణం పట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. అభిమానుల సందర్శనార్దం దొరస్వామి పార్ధీవ దేహాన్ని ఫిలిం ఛాంబర్ లో ఉంచారు. దర్శకుడు రాజమౌళి - మురళీ మోహన్ - అశ్వినీదత్ - ఎన్వీ ప్రసాద్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. 1000కి పైగా చిత్రాలకు పంపిణీదారుడిగా.. ఎన్నో విజవంతమైన చిత్రాలను నిర్మించి అభిరుచి గల నిర్మాతగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దొరస్వామి అందించిన సేవలు మరువలేనివని ఈ సందర్భంగా కొనియాడారు. మహా ప్రస్థానంలో దొరస్వామి అంత్యక్రియలు జరగనున్నాయి.
కాగా 'సీతారామయ్య గారి మనమరాలు' 'ప్రెసిడెంట్గారి పెళ్లాం' 'అన్నమయ్య' 'సింహాద్రి' వంటి చిత్రాలు దొరస్వామిరాజుకు ఎనలేని పేరుప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా అక్కినేని నాగార్జున - రాఘవేంద్రరావు కాంబినేషన్ లో ఆయన తీసిన 'అన్నమయ్య' సినిమా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. రెండు జాతీయ పురస్కారాలతో పాటు ఎనిమిది నంది అవార్డులను కూడా ఈ సినిమా గెలుచుకుంది. దొరస్వామి మృతిపై రాజమౌళి - ఎన్టీఆర్ స్పందిస్తూ.. 'సింహాద్రి: సినిమా మంచి విజయం సాధించడంలో ఆయన పాత్ర ఎంతో కీలకమని అన్నారు.
Post a Comment