Header Ads

మెగాస్టార్ కోసం ఇండియాలోనే అతిపెద్ద సెట్ వేసారా..?? | The biggest set in India for Megastar



సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆచార్య. ఈ సినిమా కోసం ఇండియాలోనే ఇంతవరకు వేయని అతిపెద్ద సెట్ వేయబోతున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఆచార్య కోసం టెంపుల్ టౌన్ సెట్ అవసరం అని చెప్పడంతో ఈ భారీ సెట్ ప్లాన్ చేశారు. ప్రముఖ కళా దర్శకుడు సురేష్ సెల్వరాజన్.. ఆచార్య టెంపుల్ టౌన్ సెట్ రూపొందిస్తున్నాడు. సురేష్ ఇదివరకు క్రిష్ 3 అగ్నిపథ్ పేటా భారత్ లాంటి భారీ బాలీవుడ్ సినిమాలకు వర్క్ చేసి ప్రశంసలు అందుకున్నాడు. హైదరాబాద్ శివార్లలో సుమారు 20 ఎకరాల్లో ఆచార్య టెంపుల్ టౌన్ సెట్ నిర్మించారు. సురేష్ తో కొరటాల శివ ఇదివరకే భరత్ అనే నేను చేసాడు. ఆ సినిమా కోసం సురేష్ సెల్వరాజన్ అసెంబ్లీ సెట్ నిర్మించాడు. ఇక సురేష్ పనితనం కొరటాల శివను ఆకట్టుకోవడంతో ఈ సినిమా కూడా అతనికి అప్పగించాడు. ఆచార్య భారీ టెంపుల్ టౌన్ సెట్ లాంటిది.. ఇంతవరకు ఏ ఇండియన్ సినిమాకి నిర్మించలేదని టాక్.

ఈ భారీ సెట్ కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేశారట నిర్మాతలు. కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవితో పలు ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారట. జనవరి 10 నాటికి మెగాస్టార్ సోలో సీన్స్ పూర్తి అవుతాయట. ఇదిలా ఉండగా.. జనవరి 7న చిరుతో రాంచరణ్ షూట్లో పాల్గొనవలసి ఉంది. కానీ రాంచరణ్ కు కోవిడ్ పాజిటివ్ రావడంతో ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నాడు. ఆయన పూర్తిగా కోలుకొని నెగటివ్ వచ్చాక శివ.. చరణ్ తో షూట్ చేస్తాడట. ఈ సినిమాలో రాంచరణ్ పాత్ర చాలా కీలకం కావడంతో 30రోజుల భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారట మేకర్స్. చరణ్ పాత్ర సినిమాకి హైలైట్ కానుందట. ఇక అన్ని కుదిరితే జనవరిలోనే చరణ్ తో షూట్ ముగిస్తారట. లేదంటే ఫిబ్రవరిలో కూడా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో మెగాస్టార్ చిరు చరణ్ లపై ఒక స్పెషల్ ప్లాన్ ప్లాన్ చేశారట. ఈ సాంగ్ అభిమానులకు ఒక పెద్ద గిఫ్ట్ అవుతుందట. మెగా అభిమానుల టేస్ట్ తెలిసే శివ ఈ సాంగ్ ప్లాన్ చేసాడట. ఇక కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇక మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

No comments

Powered by Blogger.