Header Ads

ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ మార్పులు | AP Panchayat Election Schedule Changes

 AP Panchayat Election Schedule Changes

ఏపీ పంచాయితీ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. మొదటి దశలో నిర్వహించే ఎన్నికల కోసం నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

సర్పంచి వార్డు సభ్యులకు శుక్రవారం నుంచి ఆదివారం జనవరి 31వరకు తొలి విడత నామినేషన్లను స్వీకరిస్తారు. పోటీలో ఉన్న అభ్యర్థుల తుదిజాబితాను ఫిబ్రవరి 4న అధికారులు ప్రకటిస్తారు. ఫిబ్రవరి 3 నుంచి 7 సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు. 9న ఎన్నికలు నిర్వహించనున్నారు.

పంచాయితీ ఎన్నికలకు సంబంధించి ఈనెల 23న విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ లో ఎస్ఈసీ స్వల్ప మార్పులు చేశారు. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రకాశం విజయనగరం పశ్చిమగోదావరి జిల్లాల్లో భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా రెవెన్యూ డివిజన్ లోని అన్ని మండలాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఎన్నికల కమిషన్ తేల్చింది. ఒక్కో డివిజన్ లోని కొన్ని మండలాలను విడదీసి వేర్వేరు విడతల్లో చేపట్టాల్సి ఉంటుందని కోరారు.

ఈ మేరకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆ జిల్లాలకు సంబంధించి మార్పులు చేస్తూ ఆదేశాలిచ్చారు.

No comments

Powered by Blogger.