మహేష్ బాడీ.. డేవిడ్ వార్నర్ ఫేస్.. సీన్ అదుర్స్
ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ గురించి క్రికెట్ ఫ్యాన్స్ కు చెప్పాల్సిన పనిలేదు. ఇక తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే ఈ పించ్ హిట్టర్. గ్రౌండ్ లో బౌలర్లకు చుక్కలు చూపించే ఈ బ్యాట్స్ మెన్.. సినీ ప్రేక్షకులకు కూడా మస్తు మజా పంచుతున్నాడు. ఆ మధ్య లాక్ డౌన్ లో మన తెలుగు హీరోల కన్నా.. వార్నర్ నుంచి వచ్చిన ఎంటర్టైన్మెంట్ పాళ్లే ఎక్కువగా ఉంటాయి. టిక్ టాక్ లో మన స్టార్ హీరోలపై అదిరిపోయే వీడియోలు చేసి ఓ రేంజ్ ఎంటర్టైన్మెంట్ అందించాడీ ఆస్ట్రేలియన్. ఆ తర్వాత ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడి ఆడియన్స్ లో ఫుల్ జోష్ నింపాడు.
ఇక.. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు వార్నర్ కు ప్రత్యేక బంధమే ఉందని చెప్పాలి. ఆ మధ్యన మహేష్ పాటలకు తనదైన స్టెప్పులు వేసి అదరగొట్టిన వార్నర్ తాను కూడా మహేష్ ఫ్యాన్ నే అని చెప్పి మహేష్ అభిమానులకు ఫుల్ కిక్కిచ్చాడు. దీంతో.. వార్నర్ పై మరింత అభిమానం పెంచుకున్నారు ప్రిన్స్ ఫ్యాన్స్.
అయితే.. తాజాగా మహేష్ అభిమానులకు మరో కొత్త కానుక అందించాడు వార్నర్. ఈ కొత్త సంవత్సరం కానుకగా మాంచి గిఫ్ట్ ఇచ్చాడు. ఈ సారి రీఫేస్ యాప్ ద్వారా మ్యాజిక్ క్రియేట్ చేశాడు. మహేష్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ “మహర్షి” సినిమాలోంచి కొన్ని సీన్స్ సెలక్ట్ చేసుకొని రీఫేస్ యాప్ ద్వారా.. మహేష్ ఫేస్ బదులు తన ఫేస్ యాడ్ చేశాడు. ఈ విధంగా కొన్ని షాట్స్ కలిపి ఓ వీడియోను రూపొందించి పోస్ట్ చేశాడు వార్నర్. ఇందులో మహేష్ బాబు డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియో చూసిన మహేష్ ఫ్యాన్స్.. ఫిదా అయిపోతున్నారు. మరీ ముఖ్యంగా.. బజాజ్ చేతక్ పై వచ్చే సీన్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మరి ‘మహర్షి’ అవతారం ఎత్తిన వార్నర్ ఎలా ఉన్నాడో మీరూ ఓ లుక్కేయండి.
Post a Comment