ప్రియుడి మోజులో తల్లి, ప్రియురాలి కోసం తండ్రి.. నీచం
వివాహేతర సంబంధాల కోసం కన్నవాళ్లే కసాయిలుగా మారారు. కన్నబిడ్డలను సంతలో పశువుల్లా అమానుషంగా అమ్మకానికి పెట్టారు. పదేళ్లు కూడా దాటని కొడుకులను పశువుల కాపరులుగా మార్చేశారు.
బాలుడిని కొనుక్కున్న యజమాని బసుదేవ్‌ని ఆవులకు కాపలా పెట్టాడు. తినడానికి భోజనం మినహా ఏమీ ఇచ్చేవాడు కాదు. యజమాని వేధింపులు భరించలేకపోయిన బసుదేవ్ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆశ్రయించాడు. బాలుడి పరిస్థితి విని కేంద్రం నిర్వాహకురాలు జయంతి ఖరా బాలుడి సంరక్షణ చర్యలు చేపట్టింది. కొద్దిరోజులకే ఆ విషయం తెలుసుకుని బాలుడిని కొనుక్కున్న యజమాని నేరుగా అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చి నిర్వాహకురాలు జయంతితో గొడవకు దిగాడు. విషయం సీరియస్ కావడంతో ఆమె ఉన్నతాధికారులకు సమాచారం అందించింది.
రంగంలోకి దిగిన అధికారులు విచారణ చేపట్టడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తనకు తమ్ముడు జగన్నాథ్ ఉన్నాడని.. తనని కూడా తండ్రి అమ్మేశాడని చెప్పడంతో అతన్ని కూడా చైల్డ్ లైన్ ప్రతినిధులు సంరక్షించారు. వేర్వేరు పెళ్లిళ్లు చేసుకునేందుకు బిడ్డలను అమ్మేసిన ఘటన ఉన్నతాధికారులకు తెలియడంతో గ్రామానికి వచ్చి విచారణ చేపట్టారు. చిన్నారులు కోరుకుంటే వారి సమీప బంధువులకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని.. లేకుంటే మల్కన్‌గిరిలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించి విద్య, సంరక్షణ బాధ్యతలు చూసుకుంటామని మతిలి బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఆశిష్ కుమార్ తెలిపారు.
Post a Comment