Header Ads

RCB vs DC: కోహ్లిని ఊరిస్తోన్న అరుదైన రికార్డ్.. తొలి భారతీయుడిగా నిలవనున్న విరాట్

 

Virat Kohli
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ అర్ధశతకంతో ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లిని టీ20ల్లో అరుదైన రికార్డు ఊరిస్తోంది. సోమవారం ఢిల్లీ క్యాపిట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో కోహ్లి మరో పది పరుగులు చేస్తే చాలు.. టీ20ల్లో 9 వేల రన్స్ మైలురాయిని చేరుకుంటాడు. టీ20ల్లో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా కోహ్లి రికార్డ్ క్రియేట్ చేస్తాడు. ఓవరాల్‌‌గా టీ20ల్లో 9 వేల రన్స్ చేసిన ఏడో బ్యాట్స్‌మెన్‌గా విరాట్ నిలుస్తాడు.

ఐపీఎల్‌లో 181 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 5502 పరుగులు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 5 వేల పరుగుల మైలురాయిని చేరిన రెండో క్రికెటర్‌గా కోహ్లి రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్లబ్‌లో రైనా, కోహ్లి, రోహిత్ మాత్రమే చేరారు.

టీ20ల్లో 270 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి.. 41.05 యావరేజ్‌, 134.25 స్ట్రైక్ రేట్‌తో 8990 పరుగులు చేశాడు. ఇందులో ఐదు శతకాలు కూడా ఉన్నాయి.

ఐపీఎల్‌లో 200కిపైగా సిక్సులు కొట్టిన ఆరో ఆటగాడిగానూ కోహ్లి రికార్డ్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. కోహ్లి ఐపీఎల్‌లో 192 సిక్సులు బాదాడు. మరో 8 సిక్సులు కొడితే 200 సిక్సుల మార్క్‌ను చేరుకుంటాడు. ఇప్పటి వరకూ ఐపీఎల్‌లో భారత్ నుంచి రోహిత్, రైనా, ధోనీ మాత్రమే 200 కంటే ఎక్కువ సిక్సులు కొట్టారు.

No comments

Powered by Blogger.