Header Ads

Rajamouli: రాజమౌళిపై ఎన్టీఆర్, రామ్ చరణ్ షాకింగ్ కంప్లైంట్స్.. చెప్పినా నమ్మరంటూ ఓపెన్! వీడియో వైరల్

 

రాజమౌళిపై ఎన్టీఆర్, రామ్ చరణ్ షాకింగ్ కంప్లైంట్స్
దర్శకధీరుడు రాజమౌళిపై RRR యూనిట్ మొత్తం కంప్లైంట్స్ చేసింది. ముఖ్యంగా హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్.. రాజమౌళి పనితీరు ఎలా ఉంటుందో తెలుపుతూ అన్నీ చెప్పేశారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆయన సెట్స్‌పై ఇలాగే ఉంటారంటూ ఓపెన్ అయ్యారు. పైగా కాస్త వెరైటీగా ఆలోచించి అందరూ కంప్లైంట్స్ చేసిన ఈ వీడియోను జక్కన్న బర్త్ డే కానుకగా రిలీజ్ చేసింది RRR టీమ్.
RRR కో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, నిర్మాత డీవీవీ దానయ్య, ఎన్టీఆర్, రామ్ చరణ్ అందరూ వరుసపెట్టి జక్కన్నపై కంప్లైంట్స్ చేశారు. రిలాక్స్ అవుదామనుకున్న సమయంలోనే రాజమౌళి కష్టతరమైన షాట్స్ షూట్ చేద్దామంటారని జక్కన్నపై షాకింగ్ కామెంట్ వదిలారు ఎన్టీఆర్. ఒక్క షాట్ తీయడానికే బోలెడంత సమయం తీసుకుంటారని, ఆయన పర్ఫెక్షన్‌తో మమ్మల్ని చావగొట్టేస్తుంటారంటూ అన్నీ ఓపెన్‌గా చెప్పేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భారీ బడ్జెట్ కేటాయించి ప్యాన్ ఇండియా సినిమాగా ఈ మూవీని రూపొందిస్తున్నారు రాజమౌళి. చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోయే పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన టీజర్ విడుదల చేసి మెగా అభిమానుల్లో జోష్ నింపిన రాజమౌళి.. నందమూరి అభిమానుల కోసం ప్రస్తుతం ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్ రెడీ చేస్తున్నారు.

RRR అంటే 'రౌద్రం రణం రుధిరం' అని తెలిపిన మేకర్స్.. ఈ సినిమా కోసం రాజమౌళి ఎక్కడా తగ్గడం లేదని అంటున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చి గత రికార్డులన్నీ చెరిపేయడం ఖాయం అని, అంత శ్రద్దగా జక్కన్న ఈ మూవీని చెక్కుతున్నారని అంటున్నారు. మరోవైపు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆకాశాన్నంటే అంచనాలున్నాయి.

No comments

Powered by Blogger.