జుట్టు రాలుతుందా? ఈ ఐదు సూత్రాలు ప్రయత్నించండి
![]()
జుట్టు రాలుతుందా? ఈ ఐదు సూత్రాలు పాటిస్తే ఏ సమస్య ఉండదు!
1. పోషకాహారం: జుట్టు ఒత్తుగా అందంగా ఉండాలంటే.. శరీరానికి పోషకాలు ఎంతో అవసరం. కాబట్టి.. శరీరానికి తగిన పోషకాలు అందుతున్నాయో లేదో గమనించండి. మాంసం, చేపలు, నట్స్, పచ్చని ఆకు కూరలు వంటి ఆహారాన్ని మీ రోజువారీ డైట్‌లో చేర్చుకోండి. దీనివల్ల మీ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మీ జుట్టుకు కూడా భద్రత లభించవచ్చు.
2. స్మోకింగ్ వద్దు: చెడు వ్యసనాలు ఆరోగ్యానికి చేటు. మీకు స్మోకింగ్ అలవాటు ఉన్నట్లయితే తప్పకుండా మానేయండి. పొగతాగేవారిలో జుట్టు కుదుళ్లలోని డీఎన్ఏను నాశనం చేసి జుట్టు ఎదగకుండా చేస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. కాబట్టి.. స్మోకింగ్‌కు దూరంగా ఉండి మీ జుట్టును రక్షించుకోండి.
3. బయటకు వెళ్లేప్పుడు టోపీ పెట్టుకోండి: చాలామంది క్యాప్ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుందని భావిస్తారు. కానీ, ఎండలోకి వెళ్లేప్పుడు టోపీ పెట్టుకోవడం ఎంతో మంచిది. ఎందుకంటే.. అది మీ జుట్టును యూవీ రేస్ నుంచి నుంచి రక్షిస్తాయి. యూవీ రేస్ కూడా నుంచి వెలువడే రేడియేషన్ కూడా జుట్టుకు హానికరమని పరిశోధనల్లో తేలింది. అవి తలలోని ప్రోటీన్లకు నష్టం కలిగిస్తాయి. దీనివల్ల జుట్టు త్వరగా ఊడిపోతుంది.
4. ఒత్తిడి దూరం చేసుకోండి: ఒత్తిడి వల్ల అనారోగ్యాలు త్వరగా దాడి చేస్తాయి. అంతేకాదు.. జుట్టు రాలడానికి కూడా ప్రధాన కారణం ఒత్తిడే. ఒత్తిడి వల్ల జుట్టు రాలడమే కాకుండా హెయిర్ గ్రోత్ సైకిల్‌కు ఆటంకంగా మారుతుంది. కాబట్టి, రోజు వ్యాయామం లేదా యోగా ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. కంటి నిండా నిద్రపోండి.
5. జుట్టుకు ఆ పరికారాలు మంచివి కాదు: హెయిర్ డ్రైయర్స్, స్ట్రైటనింగ్ వంటి పరికరాలు జుట్టుకు అస్సలు మంచివి కావు. వీటిని అతిగా వాడితే జుట్టు కుదుళ్లు నాశనమవుతాయి. జుట్టు పెరుగుదలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయి. అలాగే జుట్టను మరింత సన్నగా మార్చే్స్తాయి. జుట్టుకు వేడిని అందించే ఈ పరికరాలను అప్పుడప్పుడు మాత్రమే వాడాలి.
గమనిక: పై వివరాలన్నీ కేవలం సూచనలు మాత్రమే. వీటిని చికిత్స పద్ధతులుగా భావించవద్దు. జుట్టుకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. సొంత వైద్యం అస్సలు వద్దు. జుట్టు బాగా పెరిగేందుకు అవసరమైన డైట్‌ను కూడా వైద్యులను సంప్రదించిన తర్వాతే తీసుకోవాలని మనవి. పై వివరాలన్నీ కొన్ని అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయాల ప్రకారం అందించాం. ఇవి చికిత్సకు ప్రత్యామ్నాయలని భావించవద్దు. ఈ వివరాలను కేవలం మీ అవగాహన కోసమే అందించామని గమనించగలరు.
Post a Comment