పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. టీనేజ్ యువతి(17)ని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామానికి చెందిన యువతి గత నెల 21న కిడ్నాప్‌కి గురైంది. ఆమెను తూర్పు గోదావరి జిల్లా బొమ్మూరు తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశారు.
పదిహేను రోజుల అనంతరం గ్రామానికి చేరుకున్న యువతి ఈ మేరకు సమిశ్రగూడెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను కిడ్నాప్ చేసి.. అత్యాచారం చేశారని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కిడ్నాప్, అత్యాచారం, ఆమె మైనర్ కావడంతో పోక్సో తదితర సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. నిడదవోలు సీఐ విచారణ జరుపుతున్నారు.
Post a Comment