రోగికి పెట్టాల్సిన గుండెను తినేసిన కుక్క.. మన సీరియల్స్ కంటే దారుణం
- మన టీవీ చానెళ్లలో ప్రసారమయ్యే డైలీ సీరియల్స్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ సీరియల్స్ ఉండే ట్వీస్టులు .. బుర్రను హీటెక్కిస్తుంటాయి. ఇక తెలుగు సీరియల్స్‌లో శోభనం సీన్లకు కొదవే లేదు. అందులో ఎవరికైనా పెళ్లయ్యిందంటే చాలు.. వారం రోజులపాటు శోభనం వేడుకలు స్టార్టవ్వుతాయి. కుటుంబ సభ్యులు చూస్తారనే జ్ఞానం కూడా లేకుండా ఆ సీన్లను వారం రోజుల పాటు చూపిస్తూనే ఉంటారు. మళ్లీ ఆ శోభనంలో కూడా ఎన్నో ట్విస్టులు ఉంటాయి. శోభనం పాలల్లో విషం కలపొచ్చు, లేదా ఆ పని ఆపేందుకు విలన్స్ మత్తు మందు కూడా కలపొచ్చు. లేదా.. మంచమే విరగొచ్చు. ఇవన్నీ పక్కన పెడితే.. ఇలాంటి తల తోక లేని సీన్స్ కేవలం తెలుగులోనే కాదు. హిందీలో కూడా అనేకం. (Image Credit: Twitter and One Tree Hill)
ఫన్నీ సూట్ కేస్ సీన్
ఇటీవల ఓ హిందీ సీరియల్‌లో ఓ పాత్ర పరిగెడుతూ అల్మారాను గుద్దుకుంటుంది. ఆ వెంటనే తెరిచి ఉన్న పెద్ద సూట్‌కేసులో పడిపోతుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ సూట్ కేస్‌ను తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో పాడేస్తాడు. ఈ సీన్‌ను కొందరు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అంతే అది క్షణాల్లో వైరల్‌గా మారింది. ఆ సీన్ మీరు చూసి ఉండకపోతే ఈ కింది ట్వీట్‌లో చూండండి. దీని తర్వాత మనిషి గుండెను తీనేసే కుక్క సీన్‌ను చూడటం మరిచిపోకండి. (Image credit: Twitter)
సూట్ కేస్‌లో అలా ఎలా పడిందబ్బా..
గుండెను కుక్క ఎత్తుకెళ్లిపోయింది
ఇన్నాళ్లూ మన భారతీయ సీరియల్స్ మాత్రమే ఇలా ఉంటాయని మనం అనుకుంటాం. అయితే, పాశ్చాత్య దేశాల సీరియల్స్‌లో కూడా ఇలాంటి ఫన్నీ ట్విస్టులు చాలానే ఉంటాయి. ఇందుకు కుక్క సీనే ఉదాహరణ. ‘One Tree Hill’ సీజన్ 6 ఎపిసోడ్‌లో డ్యాన్ స్కాట్ అనే వ్యక్తికి గుండె మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ఓ డాక్టర్ దాత నుంచి సేకరించిన గుండెను బాక్సులో పెట్టుకుని హడావిడిగా తీసుకెళ్తాడు. ఇంతలో కుక్క చైన్‌ను తన్నుకుని పడిపోతాడు. దీంతో బాక్సులో ఉన్న గుండె కింద పడుతుంది. వెంటనే దాన్ని కుక్క మాంసం ముక్క అనుకుని తిన్నేస్తుంది. ప్రస్తుతం ట్విట్టర్‌లో వైరల్‌గా ట్రెండవ్వుతున్న ఈ సీన్ చూసి నెటిజన్స్ దిమ్మతిరిగింది. రకరకాల ట్రోల్స్‌తో పిచ్చెక్కిస్తున్నారు. ఆ వీడియోను కింది ట్వీట్లో చూడండి. (Image Credit: Twitter and One Tree Hill)
వైరల్‌గా చక్కర్లు కొడుతున్న ఆ ఫన్నీ సీన్ ఇదే
Post a Comment