Header Ads

హైపర్ ఆదికి జబర్దస్త్ ఎంత జీతం ఇస్తుందో తెలుసా?

జబర్దస్త్‌లో రెమ్యునరేషన్ వివాదం.. పేమెంట్లపై హైపర్ ఆది పంచ్‌లు..

జబర్దస్త్.. తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న కామెడీ షో. మెగా బ్రదర్ నాగబాబు, వైసీపీ ఎమ్మెల్యే రోజా జడ్జిలుగా వ్యవహరిస్తున్న ఈ షో లో యాంకర్లు అనసూయ, రష్మీ గౌతమ్ తమ అంద చందాలు ప్రదర్శిస్తూ కుర్ర ప్రేక్షకుల గుండెలను గిలిగింతలు పెట్టిస్తారు. ఇక, ఆర్టిస్టుల విషయానికి వచ్చేసరికి.. చమ్మక్ చంద్ర, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, సునామీ సుధాకర్, భాస్కర్, అదిరే అభి, రాకెట్ రాఘవ, రచ్చ రవి.. ఇలా కామెడీ టీంలు చేసే కామెడీ, పూయించే నవ్వులు కేక. షో చూస్తున్నంత సేపు నవ్వులే నవ్వులు. ఆ మధ్య వల్గారిటీ ఎక్కువైనా, ఆ తర్వాత తగ్గించేశారు. అయితే, జబర్దస్త్‌లో రెమ్యునరేషన్, బ్యాగ్రౌండ్ ఆర్టిస్టుల పేమెంట్లపై ఓ వివాదం నడుస్తూనే ఉంది. ముఖ్యంగా టీం సభ్యుల్లో కొందరికే పేమెంట్లు ఇస్తారని, మిగతా వారికి అవేమీ ఉండవని ఓ కాంట్రవర్సీ నడుస్తోంది. దానిపై పలువురు ఆర్టిస్టులు వివరణ కూడా ఇచ్చారు. షోను నిర్వహిస్తున్న మల్లెమాల ప్రొడక్షన్స్ పేమెంట్లు, రెమ్యునరేషన్ సరిగ్గానే ఇస్తున్నా.. టీం లీడర్లు మాత్రం తమకు నచ్చినవారికి మాత్రమే డబ్బులు ఇస్తారని, మిగతావారిని పట్టించుకోరని వెల్లడించారు.

అయితే, ఈ వివాదం నడుస్తున్న నేపథ్యంలో తాజాగా.. హైపర్ ఆది పేమెంట్ల విషయంపై పంచ్‌లు వేశాడు. చాలా సందర్భాల్లో ఏదైనా అంశాన్ని లేవనెత్తేందుకు స్కిట్‌ను వేదికగా చేసుకొని విమర్శలు గానీ, ప్రశంసలు గానీ చేస్తాడు. తాజాగా.. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన జబర్దస్త్ స్కిట్‌లోనూ హైపర్ ఆది పేమెంట్ విషయంపై పంచ్ వేశాడు. సైరా గెటప్‌లో ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది.. బ్యాగ్రౌండ్ ఆర్టిస్టులను పొగుడుతాడు. అయితే, వాళ్లు పేమెంట్ అడిగే సరికి.. గెట్ అవుట్ ఫ్రమ్ మై జబర్దస్త్ అని అంటాడు. అదేంటని అడిగితే.. ‘మేం వెళ్లి పేమెంట్ గురించి అడిగితే వాళ్లు కూడా ఇదే అంటున్నారు’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. దీనికి అక్కడున్న నాగబాబు, రోజా కొంత షాక్ అయ్యారు.


అక్కడే ఉన్న అనసూయ కూడా వామ్మో! ఆది ఇలా అంటున్నాడేంటి? అన్నట్లు ముఖకవళికలు పెట్టడం గమనార్హం. ఆ తర్వాత కూడా.. కంటెస్టెంట్ల పేమెంట్ల గురించి వ్యాఖ్యానించాడు. గతంలోనూ చాలా సందర్భాల్లో రెమ్యునరేషన్, పేమెంట్ల గురించి హైపర్ ఆది తనదైన శైలిలో పంచ్‌లు వేశాడు. ప్రస్తుతం దీని గురించి జోరుగా చర్చ నడుస్తోంది. కామెడీ కోసమే పేమెంట్లపై హైపర్ ఆది పంచ్ వేశాడని అనుకున్నా.. ‘నిప్పు లేనిదే పొగ రాదు’ అంటూ పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

గతంలోనూ ఇలాంటి వివాదం తలెత్తినపుడు.. అదిరే అభి కూడా స్పందించాడు. వేరే టీమ్ లీడర్ల గురించి తనకు తెలీదని, తాను మాత్రం స్కిట్ అయిపోయిన వెంటనే తన కంటెస్టెంట్లకు పేమెంట్ అందజేస్తానని వెల్లడించాడు. నిర్వాహకులు సరైన సమయానికి చెక్ అందజేస్తారని, వెంటనే వాటిని ఆర్టిస్టులకు ఇస్తానని స్పష్టం చేశాడు. కాగా, జబర్దస్త్‌లో కొంతమంది టీం లీడర్లు.. కంటెస్టెంట్లకు సరిగ్గా పేమెంట్ ఇవ్వరని, అడిగినా పట్టించుకోరన్న ఆరోపణ ఉంది.

No comments

Powered by Blogger.