Header Ads

గురక పెట్టేవారికి కరోనా ముప్పు ఎక్కువట.!

 Snorers could face upto Three Times, గురక పెట్టేవారికి కరోనా ముప్పు ఎక్కువట.!

గురక పెట్టేవారికి కరోనా వైరస్ ముప్పు ఎక్కువని పరిశోధకులు తేల్చి చెప్పారు. తాజాగా వార్‌విక్‌ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు కరోనా వైరస్, నిద్రకున్న సంబంధంపై దాదాపు 18 అధ్యయనాలు పరిశీలించి కోవిడ్‌ బారిన పడి గురక పెట్టేవారు ఆసుపత్రుల్లో చేరితే వారి ప్రాణాలకు మూడు రెట్లు ముప్పు ఎక్కువగా ఉంటుందని తేల్చారు. గుర్రుపెట్టి నిద్రపోయేవారిలో కండరాలు విశ్రాంతి తీసుకున్నప్పుడు.. శ్వాసనాళంలోకి గాలి కొద్ది నిమిషాల పాటు సరిగ్గా వెళ్ళదు. ఆ సమయంలోనే వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశాలు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. (Snorers could face upto Three Times)

గురక పెట్టేవారికి కరోనా సోకితే అది ఒక రిస్క్ ఫ్యాక్టరే అవుతుంది గానీ.. అదనపు రిస్క్ ఫ్యాక్టర్ కాబోదని పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా స్థూలకాయం, రక్తపోటు, మధుమేహం, అధిక రక్తపోటు లాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారికి గురకపెట్టే అలవాటు వస్తుందని.. వారికి కరోనా సోకితే రిస్క్ మరింతగా పెరుగుతుందన్నారు. కాగా, బ్రిటన్‌లో 15 లక్షల మందికి, అమెరికాలో 22 మిలియన్ల మందికి గురక సమస్య ఉన్నట్లు పరిశోధకులు స్పష్టం చేశారు.

No comments

Powered by Blogger.