“నైటీలు” పగలు వేసుకోవడం వల్ల కలిగే ఈ నష్టాల గురించి తెలుస్తే…ఆడవాళ్ళు ఇంకోసారి ఆ తప్పు చేయరు.!
మామూలుగా ఆడవాళ్లు నైటీ పగటిపూట కూడా వేసుకుంటూ ఉంటారు. ఒకవేళ బయటికి వెళ్లాల్సి ఉంటే నైటీ మీద చున్నీ లాంటిది ఏదైనా కప్పుకొని వెళతారు. కానీ నైటీ పగటిపూట వేసుకోవడం సరైనది కాదట. దానికి కారణాలు ఏంటంటే.
మనం రాత్రి పడుకున్నప్పుడు మన ఒంటి మీద ఎన్నో క్రిములు చేరతాయట. అలాగే మనం పొద్దున లేచిన తర్వాత పళ్ళు తోముకోవడం లాంటి పనులు చేసినప్పుడు క్రిములు ఇంకా ఎక్కువగా ఉంటాయట. అలా మనకి తెలియకుండా
మనం పొద్దున నిద్ర లేచే సమయానికి ఎంతో బ్యాక్టీరియా మన మీద ఉంటుంది.
ఒకవేళ ఆ బ్యాక్టీరియాతో వేరే గదులలో కి వెళితే క్రిములు వ్యాపించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వంటగదిలోకి వెళ్తే మన చుట్టూ ఉన్న వంట పదార్థాల పై కూడా బ్యాక్టీరియా అనేది పడుతుంది. కాబట్టి వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంటుంది. అందుకే స్నానం చేసిన తర్వాతే వంటగదికి వెళ్లాలి అని అంటారు.
అంతేకాకుండా నైటీ అన్న పదం లో నైట్ ఉంది అంటే అవి రాత్రి పూట వేసుకునే దుస్తులు అన్న విషయాన్ని సూచిస్తుంది. కాబట్టి నైటీలు రాత్రిపూట మాత్రమే వేసుకోవాలి. ఇంకొక కారణం ఏంటి అంటే గౌను లాగా ఉండే నైటీలు అందరూ క్యారీ చేయలేరు. అలాంటి వాళ్ళు నైట్ సూట్ వేసుకోవాలట. లేదా ఓవర్ కోట్ ధరించాలట. అప్పుడు నైటీ లేదా నైట్ డ్రెస్ ని ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా క్యారీ చేయగలుగుతారట.
Post a Comment