Header Ads

‘మోసగాళ్లు’ మంచు విష్ణు సరసన హాట్ బ్యూటీ... ఫస్ట్‌లుక్‌ అదుర్స్

 

రూహీ సింగ్
మంచు విష్ణు తాజా చిత్రం 'మోస‌గాళ్లు' చిత్రంలో బాలీవుడ్ భామ రుహీ సింగ్ న‌టిస్తున్నారు. ఆమెకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. మోహిని పాత్రలో కనిపించనున్న ఆమె ఈ పోస్టర్‌లో రాత్రివేళ రోడ్డుపై ఒంట‌రిగా న‌డుచుకుంటూ వెళ్తూ డిజైన‌ర్ దుస్తుల్లో గార్జియ‌స్‌గా క‌నిపిస్తున్నారు. ఇప్పటివ‌ర‌కూ మంచు విష్ణు, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సునీల్‌శెట్టి పోస్టర్లను విడుదల చేసిన యూనిట్ తాజాగా రుహీ సింగ్‌ ఫ‌స్ట్‌‌లుక్ వదిలింది.

ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కు సినీ ప్రియుల నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. టీజ‌ర్‌లో శ్యామ్ సీఎస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు అద్భుతంగా ఉంది. 'మోస‌గాళ్లు' సినిమా తెలుగుతో పాటు త‌మిళ‌ం, మ‌ల‌యాళం, క‌న్నడ, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మంచు విష్ణుకు సోదరిగా కాజల్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. జెఫ్రీ గీ చిన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
first look

తారాగ‌ణం:
విష్ణు మంచు, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సునీల్‌శెట్టి, రుహీ సింగ్‌, న‌వీన్ చంద్ర, న‌వ‌దీప్‌
సాంకేతిక బృందం:

నిర్మాత‌: విష్ణు మంచు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్‌కుమార్ ఆర్‌.
డైరెక్టర్: జెఫ్రీ గీ చిన్‌
మ్యూజిక్‌: శ్యామ్ సి.ఎస్‌.
సినిమాటోగ్రఫీ: షెల్డన్ చౌ
ప్రొడ‌క్షన్ డిజైన్‌: కిర‌ణ్‌కుమార్ ఎం.

No comments

Powered by Blogger.