ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాహనాలపై ఉండే నంబర్ ప్లేట్ల గురించి తెలుసా..?
సాధారణంగా మన దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లినా సరే అక్కడ ఆ రాష్ట్రానికి చెందిన కోడ్‌లు, నంబర్లతో వాహనాలు మనకు కనిపిస్తాయి. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో కోడ్ ఉంటుంది. అక్కడ ఎప్పటికప్పుడు జారీ చేసే నంబర్లను వాహనాలకు కేటాయిస్తారు. అవే నంబర్లతో మనకు ఆ వాహనాలు కనిపిస్తాయి. అయితే మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలకు చెందిన వాహనాలు మాత్రం భిన్న రకాల నంబర్ ప్లేట్లతో మనకు కనిపిస్తాయి. మరి ఆ నంబర్ ప్లేట్లకు అర్థాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
మిలిటరీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో వాహనాల నంబర్ ప్లేట్లపై నంబర్లలో ముందుగా ఓ బాణం గుర్తు పైకి సూచిస్తూ ఉంటుంది. అంటే ఆ వాహనం రోడ్డుపై ప్రయాణించవచ్చని, అందుకు దానికి అర్హత ఉందని అర్థం. ఇక తరువాత వచ్చే రెండు అంకెలు ఆ వాహనం తయారై, దిగుమతి అయిన సంవత్సరాన్ని సూచిస్తాయి. అనంతరం బేస్ కోడ్ ఉంటుంది. ఆ తరువాత వాహనం క్లాస్ ఉంటుంది.
పైన తెలిపిన వాహనాన్నే తీసుకుంటే అందులో ఉన్న నంబర్లు, అక్షరాలను బట్టి ఆ వాహనం 2000వ సంవత్సరంలో తయారై, దిగుమతి అయిందని చెప్పవచ్చు. తరువాత 074869h అనే నంబర్ ఉంది కదా.. అది ఆ వాహనం సీరియల్ నంబర్. ఇక ఆ వాహనం B క్లాస్‌కు చెందినదిగా సూచించే B అక్షరాన్ని మనం ఆ నంబర్ ప్లేట్‌పై చూడవచ్చు.
Advertisement
ఇక ఆర్మీలో ఉన్నత స్థానాల్లో విధులు నిర్వహించే వారి వాహనాలకు ఎరుపు రంగులో నంబర్ ప్లేట్లు ఉంటాయి. అలాగే వాటిపై నక్షత్ర చిహ్నాలు ఉంటాయి. నంబర్ ప్లేట్‌పై 1 స్టార్ ఉంటే అది ఇండియన్ ఆర్మీలో బ్రిగేడియర్ స్థాయి అధికారికి చెందిన వాహనమని చెప్పవచ్చు. అలాగే నేవీ వాహనాలు అయితే నంబర్ ప్లేట్లు లైట్ బ్లూ కలర్‌లోనూ, ఎయిర్ ఫోర్స్ వాహనాలు అయితే బ్లూ కలర్‌లోనూ నంబర్ ప్లేట్లు ఉంటాయి.
వాహనం నంబర్ ప్లేట్‌పై 1 స్టార్ సింబల్ మాత్రమే ఉంటే అది ఆర్మీలో బ్రిగేడియర్ లేదా కమాండర్ లేదా ఎయిర్ కమాండర్ ఆఫీసర్‌కు చెందిన వాహనమని తెలుసుకోవాలి. అదే నంబర్ ప్లేట్‌పై 4 స్టార్ సింబల్స్ ఉంటే అది చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ లేదా ఎయిర్ స్టాఫ్ లేదా ఆర్మీ వాహనమని గుర్తించాలి. ఇక నంబర్ ప్లేట్‌పై 5 స్టార్ సింబల్స్ ఉంటే అది ఫీల్డ్ మార్షల్ అడ్మిరల్ ఆఫ్ ది ఫ్లీట్ లేదా మార్షల్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్‌కు చెందిన వాహనమని గుర్తించాలి.
అయితే దేశంలో 5 స్టార్ సింబల్స్ ఉన్న నంబర్ ప్లేట్లు కలిగిన వాహనాలు కేవలం 3 మాత్రమే ఉన్నాయి. వాటిల్లో ఒక వాహనం చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ కోదండర మడప్ప కరియప్పకు చెందినది. మరొక వాహనం ఫీల్డ్ మార్షల్ శామ్ మానెక్షాకు చెందినది. ఇక చివరి వాహనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మార్షల్ అర్జన్ సింగ్‌కు చెందినది. అయితే ప్రస్తుతం ఈ ముగ్గురూ చనిపోయారు. కానీ వారు కార్లు మాత్రం ఉన్నాయి.
Post a Comment