ఆలయాల ధ్వంసం వెనకాల షాకింగ్ నిజాలు.. | Shocking facts behind the demolition of temples
ఇప్పుడు ఏపీలో అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య ఆలయాల ధ్వంసంపై పోరు నడుస్తోంది. విగ్రహాల విధ్వంసం వెనకాల అధికార పార్టీ నాయకులు ఉన్నారని టీడీపీ బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో నడుస్తున్న హాట్ టాపిక్ కూడా ఇదే. అయితే నిజంగా అధికార పార్టీ నాయకులు విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారా అంటే..దీనికి కాదనే సమాధానమే వస్తోంది. ఏపీలో ఆలయాల విధ్వంసం పై ఇప్పటివరకు పోలీసులు ఆరు కేసులు నమోదు చేశారు. దర్యాప్తు కూడా ముమ్మరంగా సాగిస్తున్నారు. ఈ కేసులకు సంబంధించి పలువురు నిందితులను కూడా అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే రాష్ట్రంలో ఆలయాల ధ్వంసం వెనుక రాజకీయ కారణాలు లేవని అంటున్నారు. కేవలం నిధుల వేట కోసం సాగిస్తున్న అన్వేషణ తోపాటు మద్యం మత్తులో జరిగిన ఘటనలే అధికంగా ఉన్నాయని పోలీసుల దర్యాప్తులో తేలుతోంది.
ఏపీలో ఆలయాల ధ్వంసంపై పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టి విచారణ సాగించారు. ముందు ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని ఆలయాల నిర్వాహకులతో భేటీ అవుతున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆలయాల వద్ద కాపలాదారుడిని నియమించుకోవాలని సూచనలు చేస్తున్నారు. కాగా విగ్రహాల విధ్వంసంపై దర్యాప్తు సాగించిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. అయితే బయట ప్రచారంలో ఉన్నట్లు ఆలయాలను ధ్వంసం వెనక రాజకీయ కారణాలు లేవని చాలావరకు ఆలయాలు గుప్తనిధుల కోసం ధ్వంసమవుతున్నాయని పోలీసులు గుర్తించారు.
మరికొన్ని చోట్ల మద్యం మత్తులో ఆలయాలపై దాడులకు పాల్పడినట్లు కనుగొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఆలయాల ధ్వంసంపై ఆరు కేసులు నమోదు చేశారు. ఈ ఆరు కేసులకు సంబంధించిన దర్యాప్తులో ఈ విషయాలు వెల్లడైనట్లు పోలీసులు చెబుతున్నారు. మరికొన్ని చోట్ల ఆలయ కమిటీ పదవుల్లో ప్రత్యర్థి వర్గానికి చెడ్డపేరు తీసుకొచ్చేందుకు దాడులు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. చిత్తూరు శ్రీకాకుళం కడప జిల్లాల్లో ఇటువంటి సంఘటనలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
మరి కొన్నిచోట్ల వ్యక్తిగత కారణాలతో కూడా విగ్రహాలను ధ్వంసం చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. గత ఏడాది కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో విగ్రహం ధ్వంసం వెనక తన భార్య ప్రసవించడంలేదని విగ్రహ అవశేషాలను తీసుకెళ్లి ఇంట్లో పెడితే ఫలితం ఉంటుందని ఓ నిందితుడు విగ్రహ ధ్వంసానికి పాల్పడినట్లు తేలింది. అలాగే కర్నూలు జిల్లాలో ల్యాండ్ సెటిల్మెంట్ కేసును దారి మళ్లించేందుకు స్థానికంగా ఆలయంలో విగ్రహానికి చెప్పుల దండ వేసి నట్లు గుర్తించారు. వైసీపీటీడీపీ నేతల మధ్య ఉన్న భూ తగాదాల దృష్టి మళ్లించేందుకు ఈ పనికి పాల్పడినట్టు సమాచారం. నెల్లూరు జిల్లా బిట్రగుంట లో ఓ పిచ్చి వాడు రథాన్ని తగలబెట్టినట్లు తెలుసుకున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంతర్వేది రామతీర్థం ఆలయాల్లో విగ్రహాల విధ్వంసం వెనక ఏం జరిగిందో ఇంకా పోలీసులు తేల్చలేదు.
Post a Comment