Header Ads

డబుల్ మర్డర్ గురించి సంచలన నిజాల్ని చెప్పిన భూతవైద్యుడు | Madanapalle double murder case

 Madanapalle double murder case

తీవ్ర సంచలనంగా మారిన మదనపల్లె డబుల్ మర్డర్ ఎపిసోడ్ కు సంబంధించి సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఇద్దరు కుమార్తెల్ని మూఢత్వంతో చంపుకున్న ఇద్దరు తల్లిదండ్రుల తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరే పేరెంట్స్ చేయలేని రీతిలో దారుణానికి పాల్పడిన తీరును జీర్ణించుకోలేని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. ఈ డబుల్ మర్డర్ గురించి బుగ్గకాలువకు చెందిన భూతవైద్యుడు సుబ్బరామయ్య మీడియాతో మాట్లాడారు. కొత్త విషయాల్ని వెల్లడించారు. గడిచిన యాభై ఏళ్లుగా తాను దుర్గమ్మ భక్తుడినని.. శనివారం ఉదయం భాస్కర్.. రాజు అనే అన్నదమ్ములు తమ బంధువుల పిల్లలకు చాలా సీరియస్ గా ఉందని పురుషోత్తం నాయుడు.. పద్మజ ఇంటికి తీసుకెళ్లారన్నారు.

ఆ సమయంలో పై అంతస్తులో ఒక అమ్మాయి అరుపులు వినిపించాయని చెప్పారు. వాళ్ల అమ్మ వచ్చి తన పిల్లలకు మంత్రించాలని కోరినట్లు వెల్లడించారు. వారి కోరినట్లే తాను మంత్రించిన తాయుత్తు తీసుకొచ్చానని చెప్పారు. వారి ఇంటికి వెళ్లేసరికి ఎవరో ఒక సన్నటి వ్యక్తి అమ్మాయిల దగ్గర కూర్చొని చెవిలో శంఖం ఊదటం తాను చూసినట్లు చెప్పారు. తాను ఇచ్చిన మంత్రించిన తాయిత్తుకు రూ.300 ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. తర్వాత ఏం జరిగిందో తనకు తెలీదన్నారు. దీంతో.. హత్యలకు ముందు అమ్మాయి చెవిలో శంఖం ఊదిన సన్నటి వ్యక్తి ఎవరన్నది ఇప్పుడు సందేహంగా మారింది. ఆ వ్యక్తిని గుర్తిస్తే.. ఈ డబుల్ మర్డర్ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే వీలుందని చెబుతున్నారు. ఇక.. తల్లి పద్మజ జైల్లోనూ తన లోకంలోనే ఉందని.. తానే శివుడినని.. తన పిల్లలు తిరిగి వస్తారని చెబుతున్నారు. ఇక.. తండ్రి పురుషోత్తం నాయుడు జైల్లో నిద్ర పోకుండా ఓం నమశ్శివాయ అంటూ కీర్తనలు చేస్తున్నట్లు చెబుతున్నారు. పద్మజను స్పెషల్ సెల్ లో విడిగా ఉంచితే.. పురుషోత్తం నాయుడ్ని మాత్రం ఇతర ఖైదీలతో కలిసి ఉంచినట్లు చెప్పారు.

No comments

Powered by Blogger.