అమెరికాలో తగ్గని కరోనా కేసులు.. వెలుగులోకి కొత్త స్ట్రెయిన్..! | Dangerous Disease In America
అమెరికాలో కరోనా తీవ్రత తగ్గడం లేదు. ఓ వైపు వ్యాక్సినేషన్ మొదలుపట్టినప్పటికీ అక్కడ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కాలిఫోర్నియా శాంటా క్లారా కౌంటీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక్కడ కొత్త స్ట్రెయిన్ కేసులు బయటపడుతున్నట్టు శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇటీవల బ్రిటన్లో కొత్త స్ట్రెయిన్ కరోనా కేసులు బయటపడ్డ విషయం తెలిసిందే. అయితే అమెరికాలో మరో కొత్త స్ట్రెయిన్ బయటపడినట్టు శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో 30 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదైనట్టు వైద్యులు చెబుతున్నారు.
శాంటా క్లారా కౌంటీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక్కడ 12కు పైగా కొత్త స్ట్రెయిన్ కరోనా కేసులు బయటపడ్డట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. శాంటా క్లారా కౌంటీ ప్రయోగశాలలు కొత్తగా వెలుగుచూసిన వైరస్ యొక్క జన్యు శ్రేణిలో మార్పులను అధ్యయనం చేస్తున్నాయి. కొత్త వేరియంట్ స్పైక్ ప్రోటీన్లో మూడు ఉత్పరివర్తనాలను కలిగి ఉన్నట్లు సమాచారం.
అయితే అమెరికాలో ఇప్పటికే కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. తొలిదశ పంపిణీ కూడా ప్రారంభించారు. మోడెర్నా ఫైజర్ వ్యాక్సిన్ల పంపిణీ మొదలైంది. అయితే రెండు కోవిడ్ -19 టీకాలు స్పైక్ ప్రోటీన్ను లక్ష్యంగా చేసుకోవడానికి శరీర రోగనిరోధక శక్తిని అందిస్తాయి. అయితే జన్యు పరివర్తనం చెందిన కొత్త స్ట్రెయిన్ వైరస్పై ఈ వ్యాక్సిన్లు ప్రభావం చూపుతాయా లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.
Post a Comment