దేశంలో తొలిసారి రూ.100 దాటిన పెట్రోల్ | Petrol crosses Rs 100 forthe first time in the country
పెట్రోల్ డీజల్ ధరలకు గత కొద్ది రోజులుగా రెక్కలొస్తున్నాయి. రోజురోజుకి పెట్రోల్ డీజల్ ధరలు పెరుగుతూ పెరుగుతూ .. భారత చరిత్రలో పెట్రోలు ధర తొలిసారిగా రూ. 100 మార్క్ ను తాకింది. నేడు రాజస్థాన్ లో బ్రాండెడ్ పెట్రోల్ ధర సెంచరీని అధిగమించింది. నేడు చమురు సంస్థలు పెట్రోలు ధరను 25 పైసల మేరకు పెంచడంతో ఆ మేరకు దేశవ్యాప్తంగా ధరలు పెరిగాయి. దీంతో రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ లో బ్రాండెడ్ పెట్రోలు ధర సరిగ్గా రూ. 101.15ను తాకింది.
దేశ రాజధానిలో డీజిల్ రేటు లీటరుకు రూ .76.23 కు ముంబైలో లీటరుకు రూ .83.03 కు చేరుకుందని ధరల సమాచారం.స్థానిక అమ్మకపు పన్ను లేదా వ్యాట్ను బట్టి రాష్ట్రాల వారీగా మారుతున్న ఇంధన ధరలు ఇప్పుడు దేశంలో రికార్డు స్థాయిలో ఉన్నాయి.శ్రీగంగానగర్ లో రెగ్యులర్ పెట్రోల్ ధర లీటరుకు 98.40 రూపాయలు. ప్రీమియం లేదా బ్రాండెడ్ పెట్రోల్ లీటరుకు 101.15 రూపాయలు.ఢిల్లీలో బ్రాండెడ్ పెట్రోల్ లీటరుకు రూ .89.10 ముంబైలో రూ .95.61 గా వుంది.
పెట్రోలు ధరలపై విలువ ఆధారిత పన్నులను వెంటనే తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సర్వత్రా విజ్ఞాపనలు వస్తున్నాయి. ప్రస్తుతం శ్రీగంగానగర్ లో సాధారణ పెట్రోలు ధర రూ. 98.40 ఉండగా ప్రీమియం ధర రూ. 101.15కు చేరుకుంది. ప్రీమియం పెట్రోల్ లో కాలుష్య కారకమైన ఆక్టేన్ పరిమాణం తక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే.
Post a Comment