Header Ads

మోనాల్ ఐటమ్ సాంగ్ రేటెంతో తెలుసా?

 బిగ్ బాస్ గత మూడు సీజన్లలో చాలా మంది సినిమా స్టార్లు పాల్గొన్నారు. వారిలో పలువురు తెలుగు ఆడియన్స్ కు పరిచయం ఉన్నవారే. కానీ.. బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ క్రేజ్ వారికేమాత్రం ఉపయోగపడలేదు. కానీ.. ఈ నాలుగో సీజన్లో అందరూ నామమాత్రంగా తెలిసినవాళ్లే పాల్గొన్నారు. అయినప్పటికీ.. ఈ సీజన్ కు వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. అందులో పాల్గొన్న వారికి కూడా మాంచి క్రేజ్ ఏర్పడడమే కాకుండా.. అవకాశాలు కూడా వచ్చిపడుతున్నాయి. ఇలాంటి వారిలో ఒకరు గుజరాత్ బ్యూటీ మోనాల్ గజ్జర్. బిగ్ బాస్ ఎలిమినేషన్ తర్వాత అవకాశాల మీద అవకాశాలు దక్కించుకుంటోంది ఈ బ్యూటీ. ఇటీవలే ఓ సినిమా ఐటమ్ సాంగ్కు ఓకే చెప్పిన మోనాల్ గజ్జర్.. దాని కోసం భారీ రేట్ ఫిక్స్ చేసినట్టు టాక్.

తెలుగులో హీరోయిన్ గా



తెలుగులో హీరోయిన్ గా చేసినప్పటికీ ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు. అల్లరి నరేష్ నటించిన ‘సుడిగాడు’ ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాలి’ చిత్రాల్లో హీరోయిన్గా చేసింది మోనాల్ గజ్జర్. దాని తర్వాత మరో చిత్రంలోనూ కనిపించింది. అయినప్పటికీ ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. దీంతో టాలీవుడ్కు దూరమై.. ఇతర భాషల సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ నాలుగో సీజన్లో ఛాన్స్ కొట్టేసింది.

బిగ్ బాస్ నాలుగో సీజన్లో మొదటి కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగు పెట్టింది మోనాల్ గజ్జర్. అప్పటి నుంచే అందరితో మంచిగా మెలుగుతూ వచ్చింది. ఆ క్రమంలోనే అభిజీత్కు బాగా దగ్గరైంది. కొన్నాళ్ల పాటు అతడితో ట్రావెల్ చేసిన తర్వాత.. మరో కంటెస్టెంట్ అఖిల్ సార్థక్తో క్లోజ్ అయింది. ఒకేసారి ఇద్దరితో ట్రాక్స్ నడుపుతున్నట్లు చూపించడంతో ట్రైయాంగిల్ లవ్గా ఇది కనిపించింది.

అతడికి హగ్గులు ముద్దులతో రచ్చ రచ్చ రోజులు గడిచిన కొద్దీ మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ హౌస్లో అఖిల్ సార్థక్తో ప్రేమలో పడిపోయింది. నాగార్జున ముందే తన మనసులో ఆ ఉన్నాడని చెప్పి షాకిచ్చింది. అప్పటి నుంచి అతడితోనే ఉంటూ అతడి కోసమే ఆడుతూ హైలైట్ అయింది. అలాగే నామినేషన్స్ నుంచీ కాపాడుతూ వచ్చింది. అదే సమయంలో హగ్గులు ముద్దులతో రెచ్చిపోయింది. దీంతో ఆమె బాగా పాపులర్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఫినాలేకు ఒక వారం ముందు ఆమె ఎలిమినేట్ అయింది.

బిగ్ బాస్

బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్తో మోనాల్ గజ్జర్ స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతోన్న ‘డ్యాన్స్+’ అనే షోకు జడ్జ్గా ఎంపికైంది. ఓంకార్ హోస్టింగ్ చేస్తున్న ఈ షో ఇప్పటికే ప్రారంభం అయింది. దీని తర్వాత ఆమె.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న ‘అల్లుడు అదుర్స్’లో ఐటమ్ సాంగ్ చేస్తోంది. ఈ విషయాన్ని ఇటీవలే వెల్లడించింది.

కాగా.. మోనాల్ గజ్జర్ స్పెషల్ సాంగ్ చేస్తుండడంతో అందరి దృష్టంతా ‘అల్లుడు అదుర్స్’ మీదే పడింది. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా కోసం చాలా మంది బిగ్ బాస్ ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సాంగ్ కోసం ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ లీకైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మూడు నిమిషాల ఈ పాట కోసం బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ ఏకంగా రూ. 15 లక్షలు తీసుకుందట. ఇంత మొత్తం చెల్లించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారంటే.. అమ్మడి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

No comments

Powered by Blogger.