Home
/
Movies
/
Manchu Lakshmi: మంచు లక్ష్మితో రకుల్ నైట్ పార్టీ.. ఘాటు హగ్గులు.. అబ్బో! డాబాపై ఆ సీన్లు చూస్తే..
Manchu Lakshmi: మంచు లక్ష్మితో రకుల్ నైట్ పార్టీ.. ఘాటు హగ్గులు.. అబ్బో! డాబాపై ఆ సీన్లు చూస్తే..
- నిన్న (అక్టోబర్ 10) రకుల్ ప్రీత్ 30వ పుట్టినరోజు. మూడు పదుల వయసులో అడుగుపెట్టిన ఆమెకు స్పెషల్‌గా విషెస్ తెలుపుతూ మంచు లక్ష్మి ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో మంచు లక్ష్మిని ఆప్యాయంగా వెనకనుంచి రకుల్ హత్తుకోవడం చూస్తుంటే.. ఆ ఇద్దరి అనుబంధం ఎలాంటిదో అర్థమవుతోంది. ఇక డాబాపై అక్కడి వాతావరణం చూస్తుంటే రకుల్ పుట్టిన రోజు సందర్భంగా మంచు లక్ష్మి తన స్నేహితులందరికీ గ్రాండ్ పార్టీ ఇచ్చిందని తెలుస్తోంది.
రకుల్ పుట్టినరోజుకు రెండు రోజుల ముందే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసి ఇలా ఎంజాయ్ చేశారని ఫిలిం నగర్ టాక్. కాగా ఈ నైట్ పార్టీ వీడియో షేర్ చేసిన మంచు లక్ష్మి.. రకుల్‌కి స్పెషల్‌గా బర్త్ డే విషెస్ చెప్పింది. 'నిజాయితీ గల హార్డ్ వర్కర్, ఫన్, కేరింగ్, మ్యాడ్ ఫ్రెండ్, హ్యాపీ బర్త్ డే మై లవ్. నువ్వు ఎవరి లైఫ్‌ని టచ్ చేసినా హ్యాపీగా ఉంటారు' అంటూ ఆమెపై ప్రేమను కురిపించింది. దీనిపై రియాక్ట్ అయిన రకుల్.. 'లవ్యూ.. నువ్వు నా సోదరి. నా సోల్. నువ్వు నాతో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. చీర్స్..' అని తెలిపింది.
టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులను తన అందంతో మైమరిపిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం నితిన్ సరసన 'చెక్' సినిమాలో నటిస్తోంది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. దీంతో పాటు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది రకుల్.
Post a Comment