Header Ads

KKR: ఓపెనర్‌గా రాకరాక వచ్చిన అవకాశం.. చెన్నైపై అదరగొట్టిన త్రిపాఠి

 

rahul tripathi | Image: BCCI
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ రాహుల్ త్రిపాఠి అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. అంతకు ముందు ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రాహుల్.. 16 బంతుల్లో 36 రన్స్ చేసి.. కోల్‌కతాను గెలిపించే ప్రయత్నం చేశాడు. ఓపెనర్‌గా సునీల్ నరైన్ వరుసగా 4 మ్యాచ్‌ల్లో విఫలం కావడం.. ఢిల్లీపై రాహుల్ దూకుడుగా ఆడటంతో.. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌‌కతా అతడికి ఓపెనర్‌గా ప్రమోషన్ ఇచ్చింది.

  • ఓపెనర్‌గా చాలా కాలం తర్వాత వచ్చిన అవకాశాన్ని త్రిపాఠి పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. 51 బంతుల్లో 81 రన్స్‌తో కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 8 ఫోర్లు, 3 సిక్సులు బాదిన త్రిపాఠి.. 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కొద్దిగా స్లో అయినా.. కోల్‌కతా ఇన్నింగ్స్‌లో యాంకర్ రోల్ పోషించాడు. ఫ్రాంచైజీ యజమాని షారుక్ ఖాన్‌ ప్రశంసలు పొందాడు.

ఓపెనర్‌గా ఇలా..
రాహుల్ త్రిపాఠిని 2017 ఐపీఎల్ వేలంలో రైజింగ్ పుణే సూపర్ గెయింట్ రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది. స్టీవ్ స్మిత్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలో దిగిన త్రిపాఠి.. 146కిపైగా స్ట్రయిక్ రేట్‌తో 391 రన్స్ చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2018, 2019ల్లో రాజస్థాన్ తరఫున ఆడిన రాహుల్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ రెండేళ్లలో రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే నమోదు చేశాడు. 2020 ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ త్రిపాఠిని రూ.60 లక్షలకు కొనుగోలు చేసింది.

గత ఐపీఎల్ సీజన్లలో ఓపెనింగ్ బదులు మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయాల్సి రావడం త్రిపాఠిపై ప్రభావం చూపింది. ఓపెనర్‌గా 20 ఇన్నింగ్స్ ఆడిన త్రిపాఠి 600కిపైగా పరుగులు చేయగా... అందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓపెనింగ్ చేసినప్పుడు అతడు 25 సిక్సులు బాదాడు. కానీ నాన్ ఓపెనర్‌గా 15 ఇన్నింగ్స్ ఆడి.. 223 రన్స్ మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు.

No comments

Powered by Blogger.