ఐరన్ లోపానికి .. ఆహారం తో సరి..
నేటి కాలంలో చాలామంది హిమోగ్లోబిన్ తగ్గిందని ఐరన్ టాబ్లెట్లు వాడుతుంటారు. రకరకాల మందులు, టానిక్‌లు వాడుతుంటారు. ఎంతసేపు ఈ మందులు వాడటమే మనకు తెలుసు. మనచుట్టూ ఉండే ఆహార పదార్థాల్లోనూ ఐరన్ ఉంటుందని చాలా మందికి తెలియదు. హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. మందులు వాడితే సైడెఫెక్ట్స్ ఉంటాయి. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే సైడెఫెక్ట్స్ ఉండవు. రోజుకు పురుషులకు 28 మి.గ్రా, స్త్రీలకు 30 మి.గ్రా. ల ఐరన్ కావాలి. స్త్రీలకు పురుషుల కన్నా ఎక్కువ కావాలి. ఎందుకంటే వారికి రుతస్రావం అయినపుడు ఎక్కువగా రక్తం పోతుంది. అందుకే మగవారికన్నా ఆడవారే ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా గర్భినీ స్త్రీలు ఎక్కవ ఐరన్ ఉన్న ఫుడ్ తినాలి. కడుపులో శిశువు ఆరోగ్యంగా జన్మించాలంటే ఐరన్ ఎంతో అవసరం.
ఏ ఆహారాల్లో ఐరన్ ఎంత ఉంటుందో ఇప్పుడు చూద్దాం..ప్రతి 100 గ్రాముల ఆహారంలో ఐరన్…1. గోదుమలు – 5మి.గ్రా 2. బాదమ్ – 5మి.గ్రా 3. జీడిపప్పు – 6మి.గ్రా 4. వాటర్‌మిలన్ – 8మి.గ్రా 5. సజ్జలు – 8మి.గ్రా, 6. నువ్వులు – 9 మి.గ్రా 7. సెనగ పప్పు – 10మి.గ్రా 8. పుదీనా – 16మి.గ్రా 9. అటుకులు – 20మి.గ్రా 10. అవిసె ఆకులు – 29మి.గ్రా 11. తవుడు – 35మి.గ్రా 12. తోటకూర – 39మి.గ్రా 13. కాలీఫ్లవర్ కాడలు – 40మి.గ్రా 14. కొబ్బరి చెక్క – 69మి.గ్రా 15. అవిసె గింజలు – 100 మి.గ్రా నోట్ : పైన చెప్పిన ఆహారం తినగానే మన బాడీలో తగిన ఐరన్ మోతాదు పెరగదు.
తిన్న ఆహారంలో నుంచి మన శరీరం ఐరన్‌ను గ్రహించాలి. అయితే.. తినే ఆహారంలో నుంచి ఐరన్‌ను గ్రహించాలంటే మన శరీరంలో సి విటమిన్ ఉండాలి. సివిటమిన్ వండిన ఆహారంలో ఉండదు. పండ్లు, రసాలు వంటి వండని, పచ్చి వాటిలో సీ విటమిన్ ఉంటుంది. ఏరోజుకారోజు మన బాడీకి కావలిసిన సి విటమిన్ కావాలంటే రోజుకో జామకాయ గానీ, ఓ గ్లాసు బత్తాయి లేదా ఆరెంజ్ జ్యూస్ గానీ తీసుకుంటే సరిపోతుంది.
Post a Comment