Header Ads

Daily Horoscope: అక్టోబరు 08 రాశి ఫలాలు- వ్యాపారంలో నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు

 Adv: అమెజాన్‌లో రిఫ్రిజిరేటర్ స్టోర్ 700 ప్రోడక్టులను అందిస్తోంది

రాశిఫలాలను విశ్వసించేవాళ్లలో ఎంతో మంది ఉన్నారు. వ్యక్తులు తమ భవిష్యత్తు గురించి అంచనా వేస్తూ దినఫలాలను చూస్తుంటారు. ఈ రోజు అంటే అక్టోబరు 08 గురువారం చంద్రుడు.. బుధుడి రాశి అయిన మిథునంలో ప్రసారం సంచరించనున్నాడు. ఈ రాశిలో చంద్రుడు కదులుతున్న కారణంగా శుభ ఫలితాలు అందుకుంటారు. ముఖ్యంగా మిథున రాశివారికి సానుకూలంగా ఉంటుంది. నూతన పరిచయాల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. మరి ఈ రోజు ఇతర రాశివారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

​మేషం..

ఈ రోజు ఆహార పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పొట్ట సంబంధిత సమస్యలు ఉండవచ్చు. ఆఫీసులో ప్రత్యర్థుల నుంచి జాగ్రత్తగా ఉండండి. సహచరులతో కలిసి నూతన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. ఉపాధి రంగంలో గౌరవం ఎక్కువగా లభిస్తుంది. సంతానం ద్వారా పురోగతి పొందుతారు. తండ్రి మార్గనిర్దేశాల ద్వారా వ్యాపారం విస్తరించడానికి ప్రణాళిక వేసుకోండి. ఈ రోజు మీకు అదృష్టం 82 శాతం మద్దతు ఇస్తుంది.

​వృషభం..

వృషభ రాశివారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. ప్రేమికుల కోసం తగిన సమయం కేటాయిస్తారు. ప్రతి విషయంలోనూ వారి నుంచి మద్దతు లభిస్తుంది. రోజంతా ఉత్సాహభరితంగా సాగుతుంది. ఏదైనా సంఘటనను కుటుంబంలో చర్చించవచ్చు. విద్యార్థులు అసహ్యకరమైన వార్తలు వినే అవకాశముంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. నూతన అవకాశాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీకు అదృష్టం 80 సాతం కలిసి వస్తుంది.

​మిథునం..

కార్యాలయంలో పైఅధికారులు, సహచరుల నుంచి మద్దతు లభిస్తుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. భవిష్యత్తులో ఇది వ్యాపార వృద్ధికి దారితీస్తుంది. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబంతో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు. తల్లిదండ్రులకు సేవ చేయడానికి తగిన అవకాశం లభిస్తుంది. పెట్టుబడుల్లో లాభాలు అందుకుంటారు. వివాహితులకు అనుకూలంగా ఉంటుంది. వాహనాలు, భూమిని కొనుగోలు చేస్తారు. ఈ రోజు మీకు అదృష్టం 86 శాతం మద్దతు ఇస్తుంది.

​కర్కాటకం..

ఈ పనిని చూసి ఆఫీసులో సహచరులు ప్రభావితమవుతారు. దీర్ఘకాలిక పనులు పూర్తవుతాయి. మీ మాటచాతుర్యంతో కీర్తిని పెంచుకుంటారు. చట్టపరమైన వివాదాలు ముగుస్తాయి. మీకు అనుకూలమైన నిర్ణయాలు వచ్చే అవకాశముంది. కుటుంబంలో మీకంటూ ఓ గుర్తింపు ఏర్పడుతుంది. తోబుట్టువులను పూర్తిగా మీరే చూసుకుంటారు. వారి కోరికలు నెరవేరుస్తారు. ఈ రోజు మీకు అదృష్టం 84 శాతం కలిసి వస్తుంది.

​సిం​హం..

వ్యాపారంలో ఈ రోజు బిజీగా గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి విజయం వరిస్తుంది. సామాజిక పని వల్ల సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది. పెట్టుబడి పెట్టిన సొమ్ము ఇరుక్కుంటుంది. మీ పొదుపు పెరుగుతుంది. భవిష్యత్తులో ప్రయోజనం పొందుతారు. జీవిత భాగస్వామితో ప్రత్యేక కార్యక్రమానికి హాజరవుతారు. ప్రేమ, ఉత్సాహం కుటుంబంలో ఉంటాయి. ఇంటి పని చేయడానికి ఈ రోజు మీకు అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీకు అదృష్టం 85 శాతం మద్దతు ఇస్తుంది.

​కన్య..

మీకు ఉదయం నుంచి ప్రయోజనాలు, నూతన అవకాశాలు లభిస్తాయి. నిర్దిష్ట వ్యక్తిని కలిసినప్పుడు పనులన్నీ పూర్తవుతాయి. వారి కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపిస్తారు. ఈమెయిల్ ద్వారా ఏదైనా శుభవార్త అందుకుంటారు. భూమి, ఆస్తి పత్రాలను సురక్షితంగా ఉంచండి. నూతన ఒప్పందాల నుంచి వ్యాపారం లాభిస్తుంది. వీలైనంత వరకు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. ఈ రోజు మీకు అదృష్టం 86 శాతం కలిసి వస్తుంది.

​తుల..

ఉదయం నుంచి మీరు చురుకుగా ఉంటారు. ఆర్థిక సమస్యలు అంతమవుతాయి. వ్యాపారంలో ప్రయోజనం అందుకుంటారు. పెద్దవారి అనుభవాల సాయంతో అతిపెద్ద సమస్యను పరిష్కరిస్తారు. జీవిత భాగస్వామి సలహా సహాయపడుతుంది. బాల్య వివాహానికి సంబంధించిన ఆందోళన అంతమవుతుంది. కుటుంబానికి ఈవెంట్ ప్లాన్ ఉండవచ్చు. ఉద్యోగ మార్పుకు ఇది శుభ సమయం కాదు. ఈ రోజు మీకు అదృష్టం 84 శాతం మద్దతు ఇస్తుంది.

​వృశ్చికం..

ఈ రోజు వృశ్చిక రాశివారు బాగా పనిచేస్తారు. మీరు ఎంచుకున్న రంగంలో కృషి చేయడం ద్వారా గౌరవం పొందుతారు. అంతేకాకుండా ప్రయోజనాలు అందుకుంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సాయంత్రం సమయంలో కుటుంబంతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఇది మీ మనస్సును మెప్పిస్తుంది. కార్యాలయంలో ప్రత్యేక మార్పులుంటాయి. అలాగే పనులు సులభంగా జరుగుతాయి. విదేశాల్లో విద్యను పొందాలనుకునేవారికి కలిసి వస్తుంది. ఈ రోజు మీకు అదృష్టం 85 శాతం కలిసి వస్తుంది.

​ధనస్సు..

ఈ రోజు రాజకీయనాయకులకు శుభం కలుగుతుంది. సామాజిక రంగంలో మీ కీర్తి పెరుగుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞులైన వ్యక్తుల సలహా లాభానికి దారితీస్తుంది. వ్యాపార విస్తరణకు కొంత డబ్బు ఖర్చవుతుంది. కుటుంబంలో ఆస్తి వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. నూతన పెట్టుబడుల నుంచి ప్రయోజనాలు అందుకుంటారు. అంతేకాకుండా పొదుపులు కూడా ఉంటాయి. ప్రేమ జీవితంలో మానసిక ప్రశాంతత ఉంటుంది. ఈ రోజు మీకు విజయం 86 శాతం మద్దతు ఇస్తుంది.

​మకరం..

కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు ఉండవచ్చు. మీరు త్వరలోనే తెలివితేటలతో స్థిరపడతారు. కుటుంబంలో పెరుగుతున్న ఖర్చులు నియంత్రించుకోగలుగుతారు. మీరు ఎంచుకున్న రంగంలో సానుకూల మార్పులు అనుకూల పరిస్థితులను సృష్టిస్తాయి. అంతేకాకుండా మీ ప్రతిష్ఠను విస్తరిస్తాయి. వృత్తిగతంగా శత్రువులు మీ చేతిలో ఓడిపోతారు. విద్యార్థులకు గురువుల నుంచి ఆశీర్వాదం లభిస్తుంది. పెట్టుబడులకు ఇదే మంచి సమయం. ఈ రోజు మీకు అదృష్టం 84 శాతం కలిసి వస్తుంది.

​కుంభం..

విదేశాల్లో నివసిస్తున్న బందువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. తండ్రి సహకారంతో వ్యాపారంలో పురోగమిస్తారు. మీపై అధికారి సాయంతో పనులన్నింటినీ పూర్తిచేయగలుగుతారు. ఆస్తి లాభం ఉంటుంది. వాహనాలు, భూములను కొనుగోలు చేస్తారు. ఏదైనా నూతన పనిని ప్రారంభించడంలో అదృష్టం మీకు కలిసి వస్తుంది. కార్యాలయంలో సహచరుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ కృషితో మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ రోజు మీకు అదృష్టం 85 శాతం మద్దతు ఇస్తుంది.

​మీనం..

వ్యాపారంలో ఉద్రిక్తత ఈ రోజుతో ముగుస్తుంది. మీ కృషితో మంచి ఫలాలను అందుకుంటారు. కార్యాలయంలో గొప్ప వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. రోజువారీ వ్యాపారంలో నూతన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతారు. పని చేయమని ఎవరినీ బలవంతం చేయవద్దు. తల్లిదండ్రుల ఆప్యాయత, ఆశీర్వాదం పొందుతారు. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామి సలహా సహాయపడుతుంది. ఈ రోజు మీకు అదృష్టం 86 శాతం కలిసి వస్తుంది.

No comments

Powered by Blogger.