కూరగాయలు తెమ్మని భర్త జేబులో చీటి పెట్టిన భార్య…అది చూసిన భర్త షాక్.! అసలు కథ ఏంటంటే?
భార్యా భర్తల గురించిన జోక్స్ ఎప్పటికప్పుడు కొత్తవి వస్తూనే ఉంటాయి.. భర్త మీద భార్య జోకులు వేయడం ,భార్య మీద భర్త జోక్స్ చేస్తూ ఉంటారు . ప్రతిది నవ్వు తెప్పిస్తూనే ఉంటుంది..నిజంగా భార్య ఏదన్నా చెప్తే అది తీసుకురావడం భర్తకు ఒక సవాలే..తెచ్చాక ఇలా ఎందుకు తెచ్చారు, మీకు ఏ పని చెప్పిన కరెక్ట్ గా చేయరు అని గొడవ పడుతారు .. సరే నువ్వే తెచ్చుకో అంటే మీరు నాకు హెల్ప్ చేయరా అని అదొక గొడవ.. చిన్న విషమంలో లో కూడా గొడవ పది అలుగుతారు భార్యలు.అలాంటిదే ఇప్పుడు భార్యా భర్తల మధ్య జరిగిన సంభాషణ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.అందరికీ నవ్వు తెప్పించేలా చేస్తుంది.
ఏంటంటే భర్తని కూరగాయలు తెమ్మని భార్య రాసిన చీటి..చాలా క్లియర్ గా టమాటాలు ,బెండకాయలు,పచ్చిమిర్చి కావలసిన వస్తువులు తీసుకురమ్మని రాసిన చీటి.మరింకెందుకు భర్తకు అయోమయం అనుకుంటున్నారా..ఇది ఎవరైనా ఫన్నీ గా రాసి సోషల్ మీడియాలో పెట్టి ఉండొచ్చు ..ఒకసారి మీరు చూస్తే ఆ భర్త పరిస్తితి తలుచుకుని నవ్వాపుకోలేరు..ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాల్చల్ చేస్తుంది.
ఎప్పటినుండో ఈ ఫోటో వైరల్ అవుతూనే ఉంది. ఇంతకీ ఆ జంట ఎవరా అనుకుంటున్నారా? పూణే కి చెందిన ఒక వ్యక్తి..తన భార్య ఇచ్చిన ఈ లిస్ట్ ను లింక్డ్ ఇన్ పోర్ఫైల్ లో అప్లోడ్ చేసాడు. కానీ ఇంతలా వైరల్ అవుతుంది అని వారు కూడా అనుకోలేదు అంట. ఆ జంట ఎవరంటే గౌరవ్, ఎరా గౌల్కర్. 2014 లో వారికి పెళ్లయింది అంట. అసలు విషయానికి వస్తే అతనికి చాలా కూరగాయలు తెలియవు అంట. దానివల్ల చాలా సార్లు మోసపోయి కూరగాయలకు ఎక్కువ డబ్బు చెల్లించి వచ్చేవారంట. మొదట్లో అమెరికాలో ఉండేవారు అంట. అక్కడ అయితే కూరగాయలు ఆన్లైన్ లో ఆర్డర్ చేసేవారు అంట. పూణే కి షిఫ్ట్ అయ్యాక భర్త కూరగాయలు తేవడానికి వెళ్తుంటే భార్య లిస్ట్ ఆ విధంగా ఇచ్చింది అన్నమాట. ఇదండీ ఆ ఫోటో వెనక కథ.
The post కూరగాయలు తెమ్మని భర్త జేబులో చీటి పెట్టిన భార్య…అది చూసిన భర్త షాక్.! అసలు కథ ఏంటంటే? appeared first on TeluguTekTalk.
Post a Comment