Header Ads

నా క్యారెక్టర్ బ్యాడ్ చేశారు.. నా జీవితం రోడ్డుకి లాగేశారు.. మోనాల్ రోదన, నామినేషన్‌ హీట్‌లో 9 మంది

 

Pic Credit: Hotstar
సోమవారం వచ్చిందంటే బిగ్ బాస్ హౌస్‌లో హీట్ హీట్ వాతావరణం ఉంటుంది. అందులోనూ గత వారం రోజులుగా ఇంటి సభ్యుల మధ్య హాట్ హాట్ డిస్కషన్స్ జరగడంతో వాటిన్నింటినీ మనసులో పెట్టుకుని నామినేషన్స్ సందర్భంగా బయటకు కక్కి.. నామినేట్ చేస్తారు. ఇక ఐదోవారంలో ఎవరు ఎవర్ని నామినేట్ చేస్తారన్న ఆసక్తితో సోమవారం నాటి 30వ ఎపిసోడ్ ప్రారంభమైంది.
See pics: ఈ గుజరాతీ భామ ఒంపుసొంపుల సెగలు... మోనాల్ గజ్జర్ హాట్ పిక్స్..
ఇరగ ఇరగ మార్నింగ్ వేకప్ సాంగ్‌కి స్టెప్పులు వేస్తూ జోష్‌లో కనిపించారు ఇంటి సభ్యులు. అయితే నోయల్ మాత్రం నిద్ర నుంచి లేవలేకపోవడంతో బిగ్ బాస్ కుక్కలు మొరిగాయి.

నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్..
ఇక ఆలస్యం చేయకుండా నామినేషన్ ప్రక్రియను అఖిల్‌తో ప్రారంభించారు బిగ్ బాస్. ఒక్కో ఇంటి సభ్యుడు ఇద్దరిద్దరి చొప్పున నామినేట్ చేసి వారి ముఖంపై ఫోమ్ (నురుగ)ను పూయాలని.. అలాగే ఎందుకు నామినేట్ చేస్తున్నారో కారణాలు కూడా చెప్పాలని కోరారు బిగ్ బాస్.

దీంతో అందరూ ఊహించినట్టుగానే అఖిల్.. ఫోమ్‌ని అభి ముఖంపై పూసి.. నామినేట్ చేయడానికి కారణం చెప్పాడు. ఒరేయ్ అని అనడానికి నీ పర్మిషన్ తీసుకున్నానని.. అయినా దానిపై రాద్దాంతం చేశాడని.. ఏజ్, ఎడ్యుకేషన్ విషయంలో కూడా క్లారిఫికేషన్ ఇవ్వలేదని వాటివల్ల నేను హర్ట్ అయ్యానని ఇక్కడ క్వాలిఫికేషన్ అవసరం లేదన్నాడు అఖిల్. దీనిపై ఇద్దరి మధ్య రచ్చ రేగింది. నేను ఒరేయ్ అనలేదు.. అరేయ్ అని మాత్రమే అన్నాను అది కూడా నీ పర్మిషన్ తీసుకునే అన్నాను అంటూ అఖిల్ అనగా.. నువ్ ఒరేయ్ అనడం నాకు నచ్చలేదు.. క్వాలిఫికేషన్ విషయంలో కూడా నీకు క్లారిటీ లేదంటూ అభి వాదించడంతో ఇద్దర మధ్య చాలాసేపు రచ్చ సాగింది.

అనంతరం ఇద్దర్ని నామినేట్ చేయాల్సి ఉండటంతో రెండో వ్యక్తిగా రాజశేఖర్ మాస్టర్‌ని నామినేట్ చేశాడు అఖిల్. ‘మాస్టర్ గేమ్‌లో ఓడిపోతున్నాడంటే ఆయనకు నచ్చదు.. కాని ఆయన చేస్తే రైట్ మిగతావాళ్లు చేస్తే రాంగ్ అంటారు అందుకే ఆయన నచ్చలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు అఖిల్.

ఇక అరియానా గ్లోరీ రాజశేఖర్ మాస్టర్, అఖిల్‌లను నామినేట్ చేసింది. లగ్జరీ బడ్జెట్ విషయంలో అఖిల్ స్వార్థంగా ఆలోచించి.. తను అనుకున్న వాళ్ల కోసమే షాపింగ్ చేసి మిగిలిన వాళ్లకి చేయలేదని అది నచ్చకపోవడంతోనే నామినేట్ చేశానని చెప్పింది.

మాస్టర్‌ తనని హేళన చేస్తున్నారని పనిచేయడం లేదని అంటున్నారని ఆ కారణంతో నామినేట్ చేస్తున్నానని చెప్పింది అరియానా. దీంతో ఆగ్రహంతో ఊగిపోయాడు మాస్టర్.

లాస్య.. దివిని నామినేట్ చేస్తూ కిచెన్ టీంలో పాత్రలు కడగటానికి రానని చెప్పిందని.. అలాగే కుక్ చేసేటప్పుడు నీట్‌గా ఉండటం లేదని అందుకే నామినేట్ చేస్తున్నట్టు చెప్పింది లాస్య. ఇక నోయల్ తనను ఫేక్ అని నాగార్జున ముందే అనడం బాధ కలిగించిందని అందుకే నామినేట్ చేస్తున్నట్టు చెప్పింది లాస్య.

అవినాష్.. అఖిల్‌ని నామినేట్ చేస్తూ లగ్జరీ బడ్జెట్ విషయంలో కొంతమందికి మాత్రమే షాపింగ్ చేయడం నచ్చలేదని అందుకే నామినేట్ చేశానని చెప్పాడు అవినాష్. రెండో వ్యక్తిగా మోనాల్‌ని నామినేట్ చేశాడు. హిట్ మ్యాన్ గేమ్‌లో నేను సేఫ్ గేమ్ అడుతున్నాని అనడం నచ్చలేదన్నాడు.

సుజాత అఖిల్‌ని నామినేట్ చేస్తూ.. లగ్జరీ బడ్జెట్ ఇష్యూనే కారణంగానే చూపించింది. తనకు కావాల్సిన వాళ్లకు మాత్రమే లగ్జరీ బడ్జెట్‌తో షాపింగ్ చేశాడని ఆరోపించింది. రెండో వ్యక్తిగా అరియానాని నామినేట్ చేస్తూ.. సిల్లీ రీజన్ చెప్పింది.

కుమార్ సాయి.. నోయల్‌ని నామినేట్ చేస్తూ ఫస్ట్ నామినేషన్ అప్పుడు చెప్పిన రీజన్‌నే మళ్లీ మళ్లీ చెప్తున్నారని అందుకే తనకు నచ్చలేదని చెప్పాడు. ఇక రెండో వ్యక్తిగా సుజాతను నామినేట్ చేస్తూ.. ఒకరిపై డిపెండ్ అయ్యి ఆటాడుతుందని.. సొంతంగా ఆట ఆడటం లేదని.. నచ్చిన వాళ్ల విషయంలో సెల్ఫిష్‌గా అనిపిస్తున్నారని చెప్పింది.

సొహైల్.. అభిజిత్‌ని నామినేట్ చేస్తూ వాష్ రూం క్లీనింగ్‌ విషయంలో నీ ప్రవర్తన నాకు నచ్చలేదని చెప్పాడు. రెండో వ్యక్తిగా నోయల్‌ని నామినేట్ చేస్తూ కాయిన్ టాస్క్ విషయంలో సపోర్ట్ చేస్తాడని అనుకున్నానని కాని అతనే వివాదానికి కారణం అయ్యాడని అందుకే నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు సొహైల్.


సొహైల్.. అభిజిత్‌ని నామినేట్ చేస్తూ వాష్ రూం క్లీనింగ్‌ విషయంలో నీ ప్రవర్తన నాకు నచ్చలేదని చెప్పాడు. రెండో వ్యక్తిగా నోయల్‌ని నామినేట్ చేస్తూ కాయిన్ టాస్క్ విషయంలో సపోర్ట్ చేస్తాడని అనుకున్నానని కాని అతనే వివాదానికి కారణం అయ్యాడని అందుకే నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు సొహైల్.

మెహబూబ్.. సుజాతను నామినేట్ చేస్తూ తనవల్లే కెప్టెన్ టాస్క్‌ నుంచి తప్పుకున్నాని అందుకు నామినేట్ చేశానని చెప్పాడు. రెండో వ్యక్తిగా లాస్యను నామినేట్ చేశాడు మెహబూబ్.

గంగవ్వ.. నోయల్‌ని నామినేట్ చేస్తూ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని అంటాడని ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తాడని చెప్పింది. ఇక రెండో వ్యక్తిగా అభిజిత్‌ని నామినేట్ చేసింది గంగవ్వ. ఇతడు ఎవ్వరితోనూ సరిగా మాట్లాడడు అందుకే నామినేట్ చేసినట్టు చెప్పింది.

రాజశేఖర్ మాస్టర్.. అఖిల్‌, అరియానాలను నామినేట్ చేశారు. లాస్య కష్టపడినట్టుగా అరియానా కిచెన్‌లో చేయడం లేదని చెప్పారు.

ఇక అఖిల్.. అభిజిత్‌ని నామినేట్ చేశాడన్న కోపమో ఏదో తెలియదు కాని.. అఖిల్‌ని నామినేట్ చేస్తూ అతనితో మాటల యుద్ధానికి దిగింది. అఖిల్‌ని నామినేట్ చేస్తూ మొదట్లో అతనితో బాగానే ఉండేదాన్ని అని ఇప్పుడు అతనితో మాట్లాడాలి అంటే ఒక పర్సన్‌ని (మోనాల్) దాటుకుని వచ్చి మాట్లాడాల్సిన వస్తుంది. అతని యాటిట్యూట్, బిహేవియర్ నచ్చలేదని.. ఎక్స్ ప్రెషన్స్ కూడా తనకు నచ్చలేదని అందుకే నామినేట్ చేస్తున్నట్టు చెప్పింది హారిక.

రెండో వ్యక్తిగా మోనాల్‌ని నామినేట్ చేస్తూ తను ఎప్పుడూ నా.. నా అంటూ తన ఫీలింగ్స్ గురించే చెప్తుందని ఎదుటి వాళ్లని అర్థం చేసుకోదని చెప్పింది హారిక.

దివి.. లాస్యను నామినేట్ చేస్తూ ఆమె పప్పు చేయడం వల్ల అందరికీ మోషన్స్ అవుతున్నాయని.. వద్దని చెప్పినా వినడం లేదని అందుకే నామినేట్ చేస్తున్నట్టు చెప్పింది దివి. నేను పప్పు చేయడం వల్లే మోషన్స్ అవుతున్నాయంటే నేను ఒప్పుకోను.. అంటూ ఆగ్రహంతో ఊగిపోయింది లాస్య. ఇక రెండో వ్యక్తిగా సొహైల్‌ని నామినేట్ చేసింది దివి. కాయిన్ టాస్క్ విషయంలో తనని హర్ట్ చేశాడని.. అతని వల్ల దెబ్బ తగిలిందని ఎంత మర్చిపోవాలన్నా తన వల్ల కాలేదని అందుకే నామినేట్ చేస్తున్నట్టు చెప్పింది దివి.

మోనాల్.. హారికను నామినేట్ చేస్తూ.. అభితో ఇష్యూ ఉంటే అభితో మాట్లాడతా.. ఆ విషయంలో హారిక ఇన్వాల్వ్ అవ్వడం తనకు నచ్చలేదని చెప్పింది మోనాల్. నేను పర్ఫెక్ట్ కాదు.. నాలోని మిస్టేక్స్ ఉంటాయి.. కాని వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తా’ అని చెప్పింది మోనాల్. రెండో వ్యక్తిగా అవినాష్‌ని నామినేట్ చేశాడు. నువ్ చేసేది కామెడీ అని నువ్ అనుకుంటే సరిపోదని కొన్ని సందర్భాల్లో తనకి నచ్చలేదని చెప్పింది మోనాల్.

అభిజిత్.. సొహైల్‌ని నామినేట్ చేశాడు. రెండో వ్యక్తిగా అఖిల్‌ని నామినేట్ చేస్తూ.. గట్టిగానే క్లాస్ పీకాడు. నువ్ కన్ఫ్యూజ్ అవుతావని తెలుసు.. కాని పచ్చి అబద్ధాలు ఆడతావని అనుకోలేదు. లగ్జరీ బడ్జెట్ విషయంలో కొంతమందికి మాత్రమే షాపింగ్ చేయడం నాకు నచ్చలేదు.. నీ యాటిట్యూట్ కూడా నాకు నచ్చట్లేదు. కళ్లు ఇలా చేసి చూస్తే ఎవడూ భయపడిపోడు. దేనికైనా లిమిట్స్ ఉంటుంది అంటూ అభి మాట్లాడుతుండగా.. అఖిల్ రెచ్చిపోయాడు. ఒక అమ్మాయి గురించి మాట్లాడుతూ ఆమె ఐ లక్ యూ అంటే అదరికీ చెప్పుకుని సుజాత గురించి కూడా బ్యాడ్‌గా మాట్లాడుతున్నావ్.. ఇది నేషనల్ ఛానల్ ఒక అమ్మాయి గురించి ఇలా చెప్తే బయటకు ఎలా వెళ్తుంది అంటూ ఫైర్ అయ్యాడు. ఈ ఇద్దరి మధ్య గొడవ పెరిగి దూషించుకునే వరకూ వెళ్లింది. మధ్యలో హారిక మ్యాటర్ కూడా బయటకు రావడంతో దూషణల పర్వం ఎక్కువైంది.

మోనాల్ కన్నీటి పర్యంతం
అయితే పదే పదే మోనాల్ ప్రస్తావన తీసుకువచ్చి అఖిల్-అఖిలు కొట్టుకోవడానికి సిద్ధం కావడంతో మోనాల్ దండం పెట్టి బోరు బోరున ఏడ్చింది. ఐ లైక్ యు అన్నానంటే ఇద్దరూ ఇష్టమే అని.. ఎవరైనా ఇష్టమే అని.. మీరు మీరూ చూసుకోవాలని కాని.. నేషనల్ ఛానల్‌లో నా క్యారెక్టర్‌ని బ్యాడ్ చేసి.. జీవితాలతో ఆడుకోకూడదని ప్రతి విషయం టెలికాస్ట్ అవుతుందని.. నా క్యారెక్టర్‌తో ఆటలు ఆడొద్దు.. నా క్యారెక్టర్‌ని జడ్జి చేయడానికి మీరు ఎవరు?? అంటూ గట్టిగా అరుస్తూ గుండెలు అవిసేలా రోదించింది మోనాల్.


చివరిగా నోయల్.. నామినేట్ చేస్తూ ఇంటి సభ్యులకు హితోపదేశం చేశాడు.. సొహైల్ తనను నామినేట్ చేసినా తనని నామినేట్ చేయడం లేదని.. నామినేషన్ అంటే పాయింట్ ఉండాలని.. ఇంటి నుంచి వెళిపోవడానికి సరైనా పాయింట్ ఉండాలని చెప్పాడు. రాజశేఖర్ మాస్టర్‌ని నామినేట్ చేసి ట్విస్ట్ ఇచ్చాడు నోయల్. ఎలిమినేట్ అయిన స్వాతిని అకారణంగా నామినేట్ చేశారని.. అతని వల్ల ఒక మొక్క ఎదగ కుండానే వెళ్లిపోయిందని అందుకే ఎలిమినేట్ చేస్తున్నట్టు చెప్పాడు నోయల్. అయితే నువ్ స్వాతి విషయం మాట్లాడితే తప్పని అన్నావు.. మరి నువ్ ఇప్పుడు స్వాతి గురించి ఎందుకు మాట్లాడుతున్నావ్ అని సొహైల్ పాయింట్ రైజ్ చేయడంతో హర్ట్ అయిన నోయల్ తిరిగి సొహైల్‌నే నామినేట్ చేశాడు.

దీంతో ఐదోవారం నామినేషన్స్‌లో అఖిల్, నోయల్, అభిజిత్, సొహైల్, రాజశేఖర్, మోనాల్, లాస్య, సుజాత, అరియానా‌లు నిలిచారు. మొత్తానికి ఐదో వారం నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్‌గా సాగింది. బిగ్ బాస్ అప్డేట్స్ కొనసాగుతాయి మరిన్ని వివరాలు రేపటి ఎపిసోడ్‌లో.

బిగ్ బాస్ 4లో ఐదో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని భావిస్తున్నారు?



No comments

Powered by Blogger.