Header Ads

“కేజీఎఫ్ చాప్టర్ 2” టీజర్ విడుదల అప్పుడేనా ?

 

kgf

క‌ర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్‌ నేపథ్యంలో తెర‌కెక్కిన ఆ చిత్రం “కేజీఎఫ్‌”. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో యువ నటుడు యష్ హీరోగా నటించారు. ఈ చిత్రం క‌న్న‌డ‌లోనే కాక తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో మంచి విజ‌యం సాధించింది. దాదాపు 200 కోట్ల‌కి పైగా కలెక్ష‌న్స్ సాధించి అన్ని ఇండ‌స్ట్రీల‌ని షాక్‌కి గురి చేసింది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి కొన‌సాగింపుగా చాప్ట‌ర్ 2ని భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. చిత్రంలో ముఖ్య పాత్ర‌ల‌లో ర‌మ్య‌కృష్ణ‌, సంజ‌య్ ద‌త్‌, ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ర‌వీనా టాండన్.. ఇందిరా గాంధీ పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని తెలుస్తోంది. ప్రస్తుతం మన దక్షిణాది నుంచి ఇండియన్ బాక్సాఫీస్ మీదకు దండెత్తడానికి రెడీ గా ఉన్న భారీ చిత్రాల్లో ఒకటి “కేజీఎఫ్ చాప్టర్ 2”. భారీ అంచనాలను నెలకొన్న ఈ చిత్రం అక్టోబర్ లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. అయితే గత కొన్ని రోజుల కితం మాత్రం ఈ అక్టోబర్ లో సినిమా విడుదల సమయానికి మాత్రం మేకర్స్ టీజర్ ను ప్లాన్ చేస్తున్నారని టాక్ బయటకొచ్చింది. ఇప్పుడు అదే టాక్ మరింత బలపడినట్టు తెలుస్తుంది. ఈ అక్టోబర్ 25న దసరా మహోత్సవం సందర్భంగా టీజర్ విడుదలకు మేకర్స్ ప్లాన్ చేయనున్నట్టు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

No comments

Powered by Blogger.