ప్రపంచంలోనే అతి పొడవైన కాళ్లు ఈమెవేనట!
సాధారణంగా గిన్నిస్ బుక్ లో రికార్డ్ ఎక్కాలంటే ఎంత గొప్ప కార్యక్రమాలు అయినా చేసి ఉండాలి, లేదా ఎంతో ప్రత్యేకత కలిగి ఉండాలి.కానీ కాళ్ళు గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కడం అరుదైన ఘటన.
గిన్నిస్ బుక్ రికార్డ్ చోటు చేసుకునే అంత ఆ కాళ్ళ ప్రత్యేకత ఏమిటి? ఏ కారణం చేత గిన్నిస్ బుక్ రికార్డ్ చోటుచేసుకున్న తెలుసుకుందాం.
అమెరికాలోని ఆస్టిన్ కు చెందిన మాసి కురిన్ వి తన 16 వ సంవత్సరంలో గిన్నిస్ బుక్ రికార్డు చోటు చేసుకుంది.
ప్రపంచంలోని అత్యంత పొడవైన కాళ్లను కలిగి ఉండటం వల్ల ఈ రికార్డుకెక్కింది.ఈమె ఎత్తు 6 అడుగుల 10 అంగుళాలు ఉంది.అయితే తను మోడల్ కావాలనే లక్ష్యంతో తీవ్ర శ్రమిస్తోంది.
మాసి మాట్లాడుతూ ఈ పొడవైన కాళ్ళ వల్ల ప్రతిరోజు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నానని, ఎక్కడికి వెళ్లిన ఇంటి లోపలికి వెళ్లాలంటే పూర్తిగా వంగి వెళ్లాల్సిన పరిస్థితి, అంతేకాకుండా లేటెస్ట్ మోడల్ డ్రెస్ వేసుకోవాలి అన్నా దొరకడం కష్టం, తన కాళ్లకు చెప్పులు కూడా దొరకడం కష్టమేనని, నేను ప్రతిరోజు ఈ కాళ్ళ వల్ల ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
గిన్నిస్ బుక్ రికార్డును కైవసం చేసుకున్నా అనే ఆనందం కన్నా, ప్రతిరోజు ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నానని తెలియజేశారు.
మాసి ఇతర కుటుంబ సభ్యులు కూడా దాదాపు ఇంత ఎత్తులో ఉంటారు.
ఆమె తండ్రి కూడా 6 అడుగుల 5 అంగుళాలు ఉన్నారు.ఆమె సోదరుడు 6 అడుగుల 3 అంగుళాల పొడవు ఉన్నాడు.
వారి తండ్రి అంత ఎత్తు ఉండడం వల్ల మాసి కి కూడా అవే లక్షణాలు రావడంతో తన తొమ్మిదవ సంవత్సరంలోని 5 అడుగుల 7 అంగుళాల పొడవు ఉండటం విశేషం.ఈ ఎత్తువల్ల పైన ఉండే వస్తువులను చాలా సులభంగా తీసుకోగలనని మాసి తన మాటలలో చెప్పారు.
Post a Comment