ఆసియా కప్ నుండి భారత్ విత్ డ్రా | India to withdraw from Asia Cup
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆసియా కప్ 2020 టోర్నీ రద్దు అయిన సంగతి తెలిసిందే. మొదటగా 2020 ఆసియా కప్ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ వద్ద ఉండగా.. ఆ దేశంలో టోర్నీ నిర్వహిస్తే..? భారత్ టీమ్ని అక్కడికి పంపబోమని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. దీంతో.. తొలుత బీసీసీఐతో మాటల యుద్ధానికి దిగిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎట్టకేలకి వెనక్కి తగ్గి యూఏఈ వేదికగా టోర్నీని నిర్వహించేందుకు రెడీ అయ్యింది. ఈ మేరకు సెప్టెంబరులో టోర్నీ నిర్వహించేలా షెడ్యూల్ కూడా ప్రాథమికంగా తయారుచేసింది. కానీకరోనా మహమ్మారి కారణంగా ఆ టోర్నీ వాయిదా పడింది.
అయితే ఈ ఆసియా కప్ టోర్నీని శ్రీలంక వేదికగా ఈ ఏడాది జూన్ లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్న సమయంలో .. బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ లో శ్రీలంక వేదికగా జరిగే ఆసియా కప్ నుండి భారత్ వైదొలగాలనే యోచనలో బీసీసీఐ ఉంది. కరోనా కారణంగా గత ఏడాది పలు సిరీస్ లు వాయిదా పడటం అలాగే ఈ ఏడాది కూడా పలు కీలకమైన సిరీస్ లు ఉండటం కారణంగా భారత్ ఆసియా కప్ కి దూరంగా ఉండాలనే ఆలోచనలో ఉంది. ఈ క్రమంలో ఆసియా కప్ లో భారత్ పాక్ జట్లు తలపడితే చూడాలనుకున్న అభిమానులకి ఈ వార్త నిరాశ కలిగించవచ్చు. దీనితో ఇక ఈ ఏడాది భారత్ పాక్ పోరు దాదాపుగా లేనట్లే.
Post a Comment