Header Ads

ఈ టూర్ చాలా రిచ్గురు.. అంతరిక్ష యాత్రకు రూ. 400 కోట్లు | 400 crores For space travel

 400 crores For space travel

కొత్త కొత్త ప్రదేశాలకు విహారయాత్రలకు వెళ్లడం కొందరికి అలవాటు. అయితే ఇందుకోసం విదేశాల్లో ఉన్న అందమైన ప్రదేశాలు చూసేందుకు ఎన్ని డబ్బులైనా వెచ్చిస్తుంటారు. నిరంతరం కొత్త ప్రదేశాలను చూస్తూ వాళ్లు ఆస్వాదిస్తుంటారు. అయితే ముగ్గురు వ్యక్తులు ఏకంగా అంతరిక్ష యాత్రకు వెళ్లాలనుకున్నారు. ఇందుకోసం దాదాపు రూ. 400 కోట్టు వెచ్చిస్తున్నారు. అయితే సాధారణ వ్యక్తులను అంతరిక్ష యాత్రకు తీసుకెళ్లడం ఇదే తొలిసారని అంతరిక్ష పరిశోధకులు అంటున్నారు. అమెరికాకు చెందిన ఆక్సియం సంస్థ వీరిని అంతరిక్ష యాత్రకు తీసుకెళ్తుంది. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ. 400 కోట్లు వసూలు చేస్తున్నారు.

అయితే వీరు అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు స్పేస్ - ఎక్స్ తయారుచేసిన డ్రాగన్ క్యాప్యూల్ను ఆక్సియం సంస్థ వినియోగించనున్నది.  ప్రపంచంలోనే తొలిసారి ముగ్గురు సాధారణ వ్యక్తులు అంతరిక్షంలోకి వెళ్లడం చర్చనీయాంశం అయ్యింది. అమెరికాకు చెందిన ఆక్సియం సంస్థ ముగ్గురు పర్యాటకులను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపేందుకు సిద్ధమైంది. అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) కు చెందిన మాజీ వ్యోమగామి మైకేల్ లోపేజ్ సారథ్యంలో ముగ్గురు పర్యాటకులు అంతరిక్ష కేంద్రానికి చేరుకోనున్నారు.

ఆ ముగ్గురు ఐఎస్ఎస్ లో వారంపాటు గడపనున్నారు. రియల్ ఎస్టేట్ టెక్ ఎంటర్ ప్రెన్యూర్ ల్యారీ కానర్ కెనడా వ్యాపార వేత్త మార్క్ పాటీ ఇజ్రాయేల్ పారిశ్రామిక వేత్త ఐటన్ సిబ్బే ఉన్నారు. కాగా 70 ఏళ్ల కానర్ అంటరిక్షంలోకి రెండో అతి పెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందనున్నారు. వీరు గమ్య స్థానం చేరుకునేందుకు ఒకటి రెండు రోజుల సమయం పడుతుంది.

No comments

Powered by Blogger.